Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల అయ్యింది. పోస్టర్ తో పాటు చిరంజీవి పాత్రని పరిచయం చేస్తూ ఒక చిన్న టీజర్ వీడియో కూడా నిన్న విడుదల చేశారు. ఇందులో చిరంజీవితో పాటు సునీల్ కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమాతో పాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్నారు.
చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ఇటీవల విడుదల అయ్యింది. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ చిరంజీవి కం బ్యాక్ ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు. అయితే మెగాస్టార్ గత సినిమాలు గమనిస్తే ఈ సినిమాకి వాటికి ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కొంచెంసేపు ఖైదీ పాత్రలో కనిపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి అంతకుముందు కూడా చాలా సినిమాల్లో ఖైదీ పాత్రల్లో నటించారు.
అలా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ పాత్రలో నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దాని ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా రిజల్ట్ కూడా ఈ విధంగానే ఉండొచ్చు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. టీజర్, ఫస్ట్ లుక్ చూస్తూ ఉంటే ఈ పాటికి చాలా మంది ప్రేక్షకులు, “సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మెగాస్టార్ ఇంకా కొత్తగా కనిపించబోతున్నారు” అంటూ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.
End of Article