Ads
తమిళ సినిమా అయిన 96 అక్కడ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరో హీరోయిన్స్‌గా నటించారు. అద్భుతమైన విజయంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్లాసికల్ హిట్ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇందులో సమంత.. శర్వానంద్ ప్రధాన పాత్రలలో నటించారు.
Video Advertisement
అయితే ఈ సినిమా తెలుగులో అంతగా హిట్ కాలేకపోయింది. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిషలు ఈ సినిమాలో నటించారు అనేకంటే జీవించారు అనే చెప్పాలి. రామ చంద్రన్ ‘రామ్’ పాత్రలో విజయ్ సేతుపతి, జానకి ‘జాను’ పాత్రలో త్రిష మెస్మరైజ్ చేశారు. థలో ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అదిరిపోయే యాక్షన్స్ ఎపిసోడ్స్ లాంటివి ఏం లేకుండా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సాఫీగా సాగిపోయే కథతో.. కేవలం పాత్రల ద్వారా జరిగే మ్యాజిక్‌తో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టేసింది ఈ సినిమా.
అయితే ఈ సినిమా విజయం లో పాటలు, మ్యూజిక్ కీలక పాత్ర పోషించాయన్నది సత్యం. ఇందులో ప్రతి పాట మనసుకు హత్తుకుంటుంది. అయితే అన్నిటిలోకి సూపర్ హిట్ అయ్యింది “కాదలే కాదలే..” సాంగ్. ఇందులో వచ్చే మ్యూజిక్ లో మనకు పక్షి కువకువలు, వేల్స్ అరుపులు వినిపిస్తాయి. దాని వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయం లో ఒక పక్షి, ఒక వేల్ ప్రేమించుకుంటాయి. ఆ రెండు కలిసి జీవించాలి అనుకుంటాయి. కానీ పక్షి నీటిలో బ్రతకలేదు.. వేల్ నేలపై.. ఆకాశం లో జీవించలేదు.
దీంతో ఆ రెండు ఒక దానికి ఒకటి ఎంతో ఇష్టం అయినా సరే విడిపోక తప్పలేదు. ఎంత ప్రేమ ఉన్నా.. జానూ..రామ్ కూడా కలిసి ఉండలేరు అని ఈ కథ ఆధారంగా ఆ సాంగ్ లో సింబాలిక్ గా చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో వారిద్దరి ప్రేమని ఎంతో అందం గా, స్వచ్ఛంగా చూపించారు. హీరో హీరోయిన్స్ ఒకరి నొకరు ముట్టుకోకుండా..ముద్దులు, హగ్గులు లేకుండా ఇంత అందంగా ఒక ప్రేమ కథని చూపించొచ్చు అని 96 మూవీ నిరూపించింది.
End of Article