Ads
హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “సీతా రామం”. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెల్సిందే. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది.
Video Advertisement
ఈ చిత్రంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హీరోయిన్ రష్మిక మందన్న, సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
“సీతా రామం” చిత్ర విజయానికి దర్శకుడి టేకింగ్ తో పాటు పాటలు ముఖ్య భూమిక పోషించాయి. ఇందులో ” హే సీతా” అనే మెలోడీ చాల అందంగా తెరకెక్కించారు హను రాఘవపూడి. ఈ పాట మొదటిలో హీరోయిన్ సీతా, హీరో రామ్ పొలం దగ్గర అన్నం తింటూ ఉంటారు. అప్పుడు ఆ కారానికి హీరోయిన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే హీరో రామ్ ఆమెకు నీళ్ళు తాగిస్తారు. అదే పాటలో చివరికి వచ్చేసరికి హీరో హీరోయిన్లు ఒకచోట ఆగి టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కారం పొడి ఘాటుకి హీరోకి పొలమారుతుంది. కానీ హీరోయిన్ మాములుగా తింటూ ఉంటుంది.
దానికి అర్థం ఏంటంటే రామ్ ను ప్రేమించిన తర్వాత సీత తనని తానూ రామ్ కి తగ్గట్టుగా మార్చుకుంటుంది. అదే ప్రేమ గొప్పతనం. ఈ విషయాన్ని దర్శకుడు ఎంత సున్నితం గా చెప్పాడో కదా.. అందుకే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. మాములుగా చూస్తే ఈ విషయం ఎవరూ అంతగా గమనించరు. కానీ ఒకే పాటలో హీరోయిన్ క్యారెక్టర్ లోని మార్పుని ఎంత బాగా చూపించారు అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.
ఇకపోతే ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో నటీనటులకు డిమాండ్ ఏర్పడింది. హీరో దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ సినిమాతో ఇప్పటికే తనను ప్రూవ్ చేసుకోగా హీరోయిన్ మృణాల్ ఠాకూరుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరో వైపు మేకర్స్ ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.
watch video :
https://www.instagram.com/p/CiAhEvnrafk/
End of Article