Ads
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఎలా ఉంటుంది అని చాలా మందికి ఊహకి కూడా అందలేదు. అలాంటిది వారు సినిమా చేసి హిట్ కూడా కొట్టారు.
Video Advertisement
అప్పటి వరకు త్రివిక్రమ్ లో చూడని కొత్త కోణం ఈ సినిమా ద్వారా చూసాం అనిపిస్తుంది. అప్పటి వరకు ఒక రకమైన టేకింగ్ తో త్రివిక్రమ్ సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాతో యుద్ధాలు లాంటివి వద్దు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.
జగపతి బాబు, నవీన్ చంద్ర, నాగ బాబు, ఈశ్వరి రావు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సినిమా అన్నాక చాలా మంది డైరెక్టర్లు చిన్న చిన్న విషయాల మీద కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. దీన్నే డీటైలింగ్ అంటారు. సినిమాలో కొన్ని సీన్స్ లో మనం గమనించని వాటిలో కూడా డైరెక్టర్ ఏదో ఒక రకంగా ఆ సినిమాకి సంబంధించి ఒక ముఖ్య విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు.
ఈ సినిమాలో కూడా అరవింద సమేతలో క్లైమాక్స్ లో వచ్చే ఒక సీన్ లో ఇలాంటి ఒక డీటెయిల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పడానికి ప్రయత్నించారు. సినిమా అంతా కూడా ఆడవారు అనుకున్నంత తక్కువ వారు కాదు, వారికి కూడా చాలా సామర్థ్యం ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నించారు. అయితే పూజా హెగ్డే, సునీల్ తో కలిసి హీరో వాళ్ళ ఊరికి వెళుతుంది. అక్కడ హీరో వాళ్లకి గొడవలు ఉన్న కుటుంబానికి చెందిన ఈశ్వరి రావుతో మాట్లాడుతూ ఆవిడ భర్త పేరు అడుగుతుంది.
అందుకు ఈశ్వరి రావు సమాధానం చెప్పకుండా సిగ్గు పడతారు. ఊళ్ళలో భర్తల పేర్లు పలకరు, వాళ్లకి చాలా సిగ్గు అని అక్కడ చూపించారు. అయితే జగపతి బాబు కొడుకు అయిన నవీన్ చంద్రని జగపతి బాబు చంపేస్తారు. నవీన్ చంద్రని చూసి ఈశ్వరి రావు బాధపడుతూ జగపతి బాబు పేరు అయిన బసిరెడ్డి పేరుని పలుకుతూ “రేయ్ బసిరెడ్డి” అని తిడతారు. తన భర్త పేరు చెప్పడానికే సిగ్గుపడే ఒక వ్యక్తి, కోపంగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ సీన్ ద్వారా చూపించారు.
అంతే కాకుండా బసిరెడ్డి పాత్ర పోషించిన జగపతి బాబు ఎవరికీ భయపడరు. ఎవరితో అయినా పోటీ చేయగల శక్తి ఉన్నవారు. హీరోని చూసి భయపడడం కంటే ఎక్కువగా కోపంతో ఉంటారు. అయితే ఈశ్వరి రావు అలా తిడుతున్నప్పుడు బసిరెడ్డి కూడా భయంతో జంకుతాడు. అప్పటి వరకు శాంతంగా ఉండే భార్య ఇలా ప్రవర్తించడంతో, “ఆవిడ ఏం చేస్తుంది లే” అని అంతగా పట్టించుకోని వ్యక్తి, మొదటి సారిగా ఆమె కోపాన్ని చూసి భయపడ్డాడు అన్నట్టు ఈ సీన్ ద్వారా చూపించారు.
తన బిడ్డ కోసం ఒక తల్లి ఎంత దూరమైనా వెళుతుంది అనేది ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఈ ఒక్కటి మాత్రమే కాదు. సినిమాలో అరవింద పాత్రతో యుద్ధాలు ఆపాలి అని హీరోకి ఆలోచన రావడానికి అరవింద పాత్ర ఒక పునాది అయ్యేలాగా త్రివిక్రమ్ కథ రాసుకున్నారు. అంతే కాకుండా మిగిలిన ఆడవాళ్ళ పాత్రల ద్వారా కూడా ఏదో ఒక మెసేజ్ అందించారు.
ALSO READ : ముందు ఏమో అలా… తరువాత ఇలా..! “సప్త సాగరాలు దాటి” మూవీలో ఇది గమనించారా..?
End of Article