Ads
భీమ్లానాయక్ రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ట్రైలర్ విడుదల అయిన తర్వాత రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది. ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డ్రై ఏరియాలో మద్యం ఎగుమతి చేస్తున్నప్పుడు భీమ్లా నాయక్ పట్టుకుంటాడు.
Video Advertisement
ఈ కారణంగా డేనియల్ శేఖర్ అహంకారం దెబ్బతింటుంది. దాంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. డేనియల్ శేఖర్ జైలుకి వెళ్తూ వెళ్తూ, బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ భీమ్లా నాయక్ ని కలిసి అప్పుడు తన సంగతి చూస్తాను అని చెప్తాడు.
అలాగే బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి భీమ్లా నాయక్‌తో గొడవ పెట్టుకుంటాడు. అయితే.. ఇలా గొడవలు పడుతున్న టైములో ఓ ఫైట్ సన్నివేశం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. రానా కూర్చుని ఉండగా.. వెనక నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ రానా చేతులని వెనక్కి లాగి బంధిస్తాడు.
ట్రైలర్ కట్ లో ఈ సీన్ ని పెట్టారు. ఈ సీన్ కి వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సీన్ కి మరింత ఎలివేషన్ ని ఇచ్చింది. అయితే.. ఈ సీన్ ని చూస్తుంటే.. రామాయణంలోని ఇలాంటి సన్నివేశమే గుర్తొస్తూ ఉంటుంది. రామాయణంలో వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు అన్న సంగతి తెలిసిందే. కానీ, వారు విరోధులు. అన్న వాలి బలవంతుడు కావడంతో సుగ్రీవుడు రాజ్యం నుంచి తప్పించుకుని అడవుల్లో ఉంటాడు. అయితే.. రామునితో స్నేహం కుదరడంతో.. రాముడి సాయంతో సుగ్రీవుడు వాలిపై యుద్ధానికి దిగుతాడు. ఆ సమయంలో వారి మధ్య యుద్ధాన్ని చూపిస్తూ ఉన్న చిత్రం లానే ఈ సన్నివేశం కూడా ఉన్నట్లు అనిపిస్తోంది కదా.
End of Article