చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.

Video Advertisement

కానీ గాడ్ ఫాదర్ ఫ్యాన్స్ ని మాత్రం నిరాశ పరచలేదని చెప్పాలి. దీని ముందు వచ్చిన ఆచార్య సినిమా మాత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది.

minus points in god father..!!

ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక హైలైట్ అయ్యింది. సీన్ ని ఇంకా ఎలివేట్ చేసేలాగా ఆ మ్యూజిక్ ఉంది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ కి సంబంధించిన మ్యూజిక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నయనతార పార్టీ కార్యకర్తలతో మాట్లాడే ఒక సీన్ ఉంటుంది. అందులో నయనతారకి, పార్టీ కార్యకర్తలకి మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే అందులో కొంత మంది హీరో చిరంజీవి పోషించిన పాత్ర అయిన బ్రహ్మ రావాలి అని అంటారు.

అప్పుడు చిరంజీవి వస్తారు. అయితే ఈ సీన్ లో వచ్చే మ్యూజిక్ అంతకు ముందు మనం చూసిన ఒక సూపర్ హిట్ సినిమాలోని మ్యూజిక్ కి దగ్గరగా ఉంది. చాలా మంది ఈ సీన్ చూడంగానే అల వైకుంఠపురంలో సినిమాలో హీరో ఎంట్రీ సమయంలో వచ్చే మ్యూజిక్ ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వకీల్ సాబ్ సినిమాలో కూడా ఒక సీన్ లో ఇలాంటి మ్యూజిక్ ఉంటుంది అని అంటున్నారు. అందులోనూ ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమాలో సీన్ మ్యూజిక్ కి చాలా దగ్గరగా ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :