Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ఈ సినిమాలో రాఖీభాయ్ ఆడవాళ్ళ గురించి గొప్పగా చెబుతాడు. రమిక సేన్ విషయంలో గొడవ వస్తే… రాఖి భాయ్ గొడవ పడకుండా అడ్డుకుంటాడు. ఆడవాళ్ళతో గొడవలు వద్దు అని చెబుతాడు. ఆడవాళ్ళని, పిల్లలని ముట్టుకోకూడదు అని అంటాడు. ఆడవారి కోపం వినాశనాన్ని తీసుకొస్తుంది అంటూ నీతులు కూడా చెబుతాడు. కానీ, రీనా విషయంలో మాత్రం మరో విధంగా రియాక్ట్ అవుతాడు.
నిన్ను ఉంచుకోవడానికే ఇక్కడకు తీసుకొచ్చా అని చెబుతాడు. రమిక విషయంలో ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్పిన రాఖీ భాయ్ రీనా విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. దీనితో సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వచ్చాయి. రమిక విషయంలో అలా స్పందించి.. రీనా విషయంలో మాత్రం ఎలా ఎందుకు చేసాడు..? అంటూ నెటిజన్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ప్రశ్నిస్తున్నారు.
End of Article