“బృందావనం” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?

“బృందావనం” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?

by kavitha

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారాడు. అంతేకాకుండా అంతర్జాతీయంగాను పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ అంగీకరించిన చిత్రాలన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే.  ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Video Advertisement

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్  రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ సినిమాలోని ఒక మిస్టేక్ గురించి నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Brindavanam-movie-mistake-2జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, తన ప్రతిభతో ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను  వినియోగించుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో అనేక హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, ఆయన హీరోగా నటించిన ‘బృందావనం’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఎన్టీఆర్ అప్పటి దాకా మాస్ చిత్రాలను మాత్రమే చేస్తూ మాస్ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
మాస్ హీరోగా అయిన ఎన్టీఆర్ ను కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన చిత్రం బృందావనం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ మూవీ 2010లో అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో చేసిన ఒక మిస్టేక్ పై నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక సన్నివేశంలో పడుకున్న ఎన్టీఆర్ ను నటి ప్రగతి నిద్రలేపుతుంది. అయితే ఆ సీన్ లో బెడ్ పక్కనే ఉన్న పెద్ద అద్దంలో కెమెరామెన్, పక్కనే ఉన్న మరో ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ సీన్ చూసినవారు డైరెక్టర్ గారు దీనిని ఎలా మిస్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు.

watch video:

Also Read: ఈ 9 మంది హీరోయిన్స్ కి పెళ్లి అయిందన్న సంగతి చాలా మందికి తెలియదు అనుకుంట..?


End of Article

You may also like