రఘువరన్ బిటెక్ సినిమాలో ఈ పొరపాటు గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

రఘువరన్ బిటెక్ సినిమాలో ఈ పొరపాటు గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

by Anudeep

Ads

ధనుష్, అమలాపాల్ జంట గా నటించిన సినిమా విఐపి. ఈ సినిమా తెలుగు లో “రఘువరన్ బిటెక్” పేరుతొ డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు వేళ్రాజ్ దర్శకత్వం వహించారు. బి టెక్ చదివిన రఘువరన్ ఉద్యోగం దొరక్క నాలుగేళ్లు ఖాళీ గా ఉంటాడు. తనకు సరైన అవకాశం వచ్చాక సొంతం గానే కంపెనీ నడిపే స్థాయికి చేరుకొని సత్తా చాటుతాడు.

Video Advertisement

ఆ తరువాత వచ్చే పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపే సినిమా విఐపి. ఈ సినిమా హిట్ అవ్వడం తో విఐపి 2 పేరిట సీక్వెల్ ను కూడా రిలీజ్ చేసారు. అయితే సీక్వెల్ కంటే ఫస్ట్ పార్ట్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

raghuvaran btech 1

ఫస్ట్ పార్ట్ తెలుగు లోకి డబ్ అయినప్పుడు.. తెలుగునాట కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టివిలో ప్లే అవుతూ ఉంటె.. కచ్చితంగా చూసి ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు చాలా మందే ఉంటారు. అయితే.. అంతగా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ సినిమాలో కూడా ఓ పొరపాటు చోటు చేసుకుంది. అయితే.. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఓ చోట కమెడియన్ వివేక్ హీరోతో మాట్లాడుతూ పక్కనే ఉన్న మరో ఎంప్లాయ్ ఫోన్ నుంచి తన భార్య నెంబర్ కి ఫోన్ చేస్తాడు.

raghuvaran btech 2

అయితే ఆ ఎంప్లాయ్ ఫోన్ లో GF అని ఉండడంతో వివేక్ షాక్ అయ్యి.. నా భార్య నెంబర్ నీ ఫోన్ GF అని సేవ్ చేసి ఉందేంటి అని అడుగుతాడు. అయితే.. ఆ ఎంప్లాయ్ మాత్రం GF అంటే గోల్డెన్ ఫ్లవర్ అని.. వివేక్ భార్య పేరు స్వర్ణ పుష్ప కాబట్టి అలా పెట్టుకున్నానని చెప్తాడు. అయితే.. వివేక్ ఫోన్ చేస్తాడు.. కానీ స్క్రీన్ పై ఇన్కమింగ్ కాల్ వస్తున్నట్లు కనిపిస్తుంది. ఫోన్ చేస్తుంటే.. కాల్ వెళ్తున్నట్లు రావాలి కానీ.. ఇలా ఇన్కమింగ్ కాల్ వస్తున్నట్లు ఎలా కనిపిస్తుంది? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ నవ్వుకుంటున్నారు.


End of Article

You may also like