“సర్కారు వారి పాట” సినిమా ట్రైలర్ లో ఈ సీన్ గమనించారా..? అంటే అదంతా..?

“సర్కారు వారి పాట” సినిమా ట్రైలర్ లో ఈ సీన్ గమనించారా..? అంటే అదంతా..?

by Anudeep

Ads

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు, హీరోయిన్ అయిన కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అలాగే సముద్రఖనితో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి కనిపిస్తున్నారు.

Video Advertisement

ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తున్నారు.

సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

sarkaruvaripata 1

సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఎన్నో చానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా సర్కారు వారి పాట సినిమా సందడి మొదలైంది. ఈ సినిమా ట్రయిలర్ పై కూడా చాలా మీమ్స్ సందడి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటె ట్రయిలర్ లో మహేష్ బాబు సముద్ర తీరం వద్ద ఫైట్ చేసే సీన్ ఒకటి ఉంది. ఈ ఫైట్ సీన్ ట్రైలర్ లోనే హైలైట్ అయింది. అయితే.. ఈ ప్లేస్ చూసి ఎక్కడో సముద్రం వద్ద తీశారు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అది అంతా నిజం కాదు. ఆ సముద్రం సెట్ అంత VFX ఎఫెక్ట్ అట. నిజంగా సముద్ర తీరం కాదట. ఎంతైనా ఈ టెక్నాలజీ చేసే మాయలని చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేం.


End of Article

You may also like