Ads
మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడుగా డబ్ అయ్యింది. విజయ్ కెరీర్లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.
Video Advertisement
ఏపీ, తెలంగాణ మొత్తంగా ఈ సినిమా 15.05 కోట్ల షేర్‌ను, 27.10 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక మరో వైపు వారసుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అసలు వారసుడు చిత్రం ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఎన్నో ట్రోల్స్ కి గురైంది. సినిమా పోస్టర్స్ చూసి మహర్షి సినిమా గుర్తొస్తోంది అన్నారు. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ చూసి మహర్షి సినిమా మాత్రమే కాదు. ఇంకా చాలా తెలుగు సినిమాలు గుర్తొస్తున్నాయి అంటూ ట్రోల్స్ చేసారు నెటిజన్లు.
అదే విధంగా మూవీ రిలీజ్ అయ్యాక.. సూపర్ హిట్ అయినా కూడా ట్రోల్స్ అలాగే కొనసాగాయి. అంత పెద్ద స్టార్ హీరో ని పెట్టుకొని డైలీ సీరియల్ తీసారేంటని దర్శకుడిపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఈ చిత్రం లోని ఒక డైలాగ్ ని కూడా వేరే మూవీ నుంచి కాపీ చేసారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వారసుడు మూవీ లో హీరో ఒక సీన్ లో వాళ్ళిద్దరి అన్నలతో మాట్లాడే సమయం లో..” అడ్డంగా బలిసిన పిల్లి.. పులి ముందుకి వచ్చి అరబిక్ కుతూ ఆడింది అంట..” అంటాడు. ఈ డైలాగ్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
శ్రీను వైట్ల, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘ఆగడు’ చిత్రానికి యావరేజ్ రిజల్ట్ వచ్చింది. ఈ మూవీ లో ఓ హీరో, విలన్, చిన్న లవ్ స్టోరీ, మధ్యలో బుల్లి రివేంజ్, దానికి తగ్గ సెంటిమెంట్ పెట్టుకుని శ్రీను వైట్ల కామెడీకే పూర్తి స్ధానం ఇస్తూ చెలరేగిపోయాడు. ఈ మూవీ లో కూడా మహేష్ విలన్స్ తో..” డిక్కీ బలిసిన కోడి.. చికెన్ షాప్ ముందుకి వచ్చి తొడకొట్టిందట..” అని అంటాడు. దాంతో వంశి పైడిపల్లి అన్నా ఈ పంచ్ డైలాగ్ ను అక్కడ లేపావా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
End of Article