ప్రస్తుతం స్టార్ హీరోలుగా,హీరోయిన్స్ గా కొనసాగుతున్న వాళ్ళలలో చాలామంది మనల్ని చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి ఆతర్వాత స్టార్ లుగా ఎదిగారు.ఆ లిస్ట్ లో మహేష్ బాబు, రాశి,మీనా,హన్సిక,ఎన్.టి.ఆర్,తమన్నా వంటి స్టార్స్ ఎందరో ఉన్నారు.

Video Advertisement

హరికృష్ణ పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మనల్ని అలరించాడన్న విషయం మీకు తెలుసా!ఇంతకీ కళ్యాణ్ రామ్ నటించిన ఆ చిత్రం ఏంటంటే? 1989 లో కోడి రామ కృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ,సుహాసిని జంటగా ‘ బాలగోపాలుడు ‘ అనే చిత్రం చేశారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ రామ్ తొలిసారిగా తెరకు పరిచయమయ్యారు..

ఇందులో బాలయ్య తో పాటు ఇద్దరు పిల్లలు ఉంటారు. అందులో ఒకరు రాశి మరొకరు కళ్యాణ్ రామ్ వీరిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కళ్యాణ్ రామ్, రాశి చేసిన నటన వాళ్లకు మరియు ప్రేక్షకులకు ఒక స్వీట్ మెమరీగా నిలిచిపోయింది.

ఆతర్వాత సరిగ్గా పదేళ్ళకు చైల్డ్ ఆర్టిస్ట్ గా మనల్ని అలరించిన రాశి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్ణబాబు చిత్రంలో బాలయ్య సరసున హీరోయిన్ గా నటించింది. పదేళ్ళ ముందు బాలయ్యకు కూతురిగా నటించిన రాశి ఆతరువాత ఆయన పక్కన హీరోయిన్ గా చేసే స్థాయికి ఎదిగింది.ఈ చిత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇక మన కళ్యాణ్ రామ్ అటు హీరో ఇటు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.