Ads
లావుగా ఉన్నవారు వారి మీద ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్స్ విన్నతర్వాత ఒక్కసారిగా సన్నాబడాలని దృఢ నిశ్చయంతో ఎంతో కస్టపడి సన్నగా అయినవాళ్లను మనం చూస్తూనే ఉంటాం.అయితే ఒక్కసారి సన్నగా అయినతరువాత వారి ఆనందానికి అవధులు ఉండవు.అప్పుడు నేను అంత లావుగా ఉన్నాను ఇప్పుడు చుడండి ఎంత సన్నగా మారిపోయానో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చెయ్యడం మనం చూస్తూనే ఉంటాం.అయితే సరిగ్గా ఇదే కోవకి చెందుతారు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్.మొదట్లో 96 కిలోలు ఉండే ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు ఎంతో నాజూగ్గా తయారైంది.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికి పరిమితం అయిన విషయం తెలిసిందే.అయితే సారా అలీ ఖాన్ తన లాక్ డౌన్ టైమ్ ను సరదాగా గడుపుతూ సోషల్ మీడియాలో ప్రేక్షకులతో ముచ్చటిస్తూ ఉంది.అయితే తాను లావుగా ఉన్న పాత ఫోటోలను అలాగే తాను ప్రస్తుతం ఎంత సన్నగా అయ్యిందో చూపేలాగా ఒక వీడియో ను రూపాందించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు సారా .కాగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇలా సన్నపడడం అందరి వల్ల సాధ్యం కాదు ఎంతో కఠోర శ్రమ మరియు అంకితభావం కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సారా అలీఖాన్ బరువు పెరగడానికి గల కారణాలు వివరించారు.కొలొంబియాలో చదువుకునేటప్పుడు దగ్గరలో ఉన్న ఒక పిజ్జా షాప్ లో డైలీ పిజ్జా లు తినేదాన్ని .నేను ఆ షాప్ లో పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడ్డాను.ఆ క్రమంలో ప్రతీరోజు పిజ్జా లు తినడం వలన దాదాపు 96 కేజీల బరువు పెరిగిపోయాను అని సారా అన్నారు .దీనికి తోడు నాకు పిసిఓఎస్ సమస్య కూడా ఉంది అందుకే హార్మోనుల సమతౌల్యం వలన కూడా బరువు పెరిగిపోయాను అని సారా తెలిపారు .
అయితే కొలంబియా లో ఉన్నప్పుడే సినిమాలలో నటించాలని ఆసక్తి కలగడంతో సన్నగా అవ్వాలని నిశ్చయించుకొని దానికి తగిన ఆహారం మరియు వ్యాయామం చేశాను అని సారా వెల్లడించారు .పాటలు వింటూ వ్యాయామం చెయ్యడం అలవాటు అని సారా అలీఖాన్ అన్నారు.అయితే లావుగా ఉండడం వలన అందంగా లేకపోవడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని సారా అన్నారు.
End of Article