Ads
ఇప్పుడు ఉన్న చాలా మంది నటులు, లేదా సినిమా రంగంలో ఉన్నవారు సినిమాల్లోకి రాకముందే పరిచయం ఉండి, స్నేహితులుగా ఉన్న వాళ్లు ఉంటారు. కొంత మంది అనుకొని సినిమాల్లోకి వస్తే, కొంత మంది మాత్రం అనుకోకుండానే సినిమాల్లోకి వస్తారు. సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు బుధవారం నాడు అశేష అభిమానుల అశ్రు నయనాల మధ్య భువి నుండి దివికి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.
Video Advertisement
అయితే కృష్ణ గారు ఇప్పుడు లేకపోయినా అతని జ్ఞాపకాలు ఫోటోల, చిత్రాల రూపంలో కళ్ల ముందు మెదులాడుతూనే వుంటాయి. అలాంటిదే ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 1958-60 మధ్యఏలూరు లోని డాక్టర్ సి ఆర్ రెడ్డి కాలేజీ సూపర్ స్టార్ కృష్ణ గారు, మరో స్టార్ నటుడు మురళి మోహన్ గారు కలిసి చదువుకున్నారు.
వాళ్ళిద్దరూ చదివిన ఆ బ్యాచ్ ఫోటో ఒకటి వైరల్ గా తిరుగుతోంది. అందులో రెడ్ సర్కిల్ లో కృష్ణ గారు, బ్లూ సర్కిల్ లో మురళీ మోహన్ గారు ఉన్నారు. ఇండస్ట్రీ లోకి రాక ముందే కృష్ణతో మురళీ మోహన్‌కి పరిచయం ఉంది. ఈ విషయాన్ని మురళి మోహన్ చాలా సందర్భాల్లో చెప్పారు. “ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సీఆర్ రెడ్డి కాలేజీలో మేమిద్దరం క్లాస్‌మెట్స్. ఇంకా చెప్పాలంటే బెంచ్‌మెట్స్ కూడా. క్లాస్ రూములో ఇద్దరం ఫస్ట్ బెంచ్‌లో కూర్చునే వాళ్లం. అప్పటి నుంచి మా స్నేహంతో పాటు సినిమాలపై ఇంట్రస్ట్ పెరిగింది.”
“సినిమా యాక్టర్ అయ్యి.. పడవ లాంటి పెద్ద కారు కొనుగోలు చేయాలని కృష్ణకి అప్పట్లోనే ఆశ ఉండేది. అక్కినేని నాగేశ్వర రావుని చూసిన తర్వాత యాక్టర్ అవ్వాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లు శ్రమించి తేనె మనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు” అని మురళి మోహన్ గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. సినిమా విడుదల అయిన తర్వాత దాన్ని జడ్జ్ చేయడంలో ఎవరైనా కృష్ణ తర్వాతే అని మురళీమోహన్ కొనియాడారు. మురళి మోహన్ తను స్థాపించిన జయభేరి ప్రొడక్షన్ లో కృష్ణ తో, మహేష్ బాబు తో సినిమాలు చేశారు.
పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమ యాత్ర సాగింది. ఆ అంతిమ యాత్రలో కాలి నడకన అభిమానులతో కలిసి పాదం కలిపిన మురళీ మోహన్.. మహాప్రస్థానంలో పాడెని మోసి కృష్ణతో స్నేహ బంధాన్ని చాటుకున్నారు.
End of Article