ఇటీవల టాలీవుడ్ కు ఇతర ప్రాంతాలనుంచి హీరోయిన్లు వరదల్లా వచ్చి పడుతున్నారు. టాలెంట్ ఉంటే టాలీవుడ్ లో తిరుగుండదు అని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నిరూపించుకున్నారు. మనదగ్గర రాణిస్తున్న వయ్యారి భామలంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే.. ముఖ్యంగా కేరళ, కన్నడ నుంచి ఎక్కువమంది ముద్దుగుమ్మలు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. అలాగే ఇటీవల ఓ అనువాద చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది ఇవానా. అదే ‘లవ్ టుడే’ మూవీ.

Video Advertisement

ప్రస్తుతం యువత ఎలా ఉంది? ప్రేమలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చక్కగా చూపించారు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ఇవానా ఇందులో నటించి అందరి హృదయాలు కొల్లగొట్టింది. అయితే ఇవానా ఇంతకు ముందు నటించిన ఓ చిత్రం లోని స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు అందులో ఉన్నది ఇవానా నేనా.. అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫాన్స్. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇవానా 2012లో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మూడు సినిమాల్లో బాల నటిగా నటించింది. ఆ తర్వాత 2018లో కోలీవుడ్‌లోకి వెళ్లింది.

know the famous heroine in this photo..!!

ఆ తర్వాత జ్యోతిక లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన నాచియర్‌ ( తెలుగులో ఝాన్సీ) సినిమాలో కీలక పాత్ర పోషించింది. జీవీ ప్రకాశ్‌కు జోడీగా అరసి అనే పాత్రలో జీవించింది. ఆ చిత్రం లోనిదే ఈ స్టిల్. ఈ సినిమాలో ఇవానా నటనకు ప్రశంసలు దక్కాయి. ఫిలింఫేర్‌, సైమా అవార్డుల కోసం నామినేట్‌ కూడా అయ్యింది. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్‌ నటించిన హీరో చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు తొలిసారిగా లవ్‌ టుడే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో తమిళంతో పాటు తెలుగులో కూడా ఇవానాకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

know the famous heroine in this photo..!!

లవ్ టుడే లో అమ్మడి నటనకు.. అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అమ్మాయి అంటే ఇలానే ఉండాలి.. ఫ్యూచర్ లో ఇలాంటమ్మాయి లవర్ గా కుదిరితే వైఫ్ గా రావాలని అని కలలు కంటున్నారు కుర్రకారు. ఇక ఈ అమ్మడి నటన అయితే సూపర్ అనే చెప్పాలి. లవ్ టు డే సినిమా తెలుగులోనూ మెప్పించడంతో ఈ ముద్దుగుమ్మ కు తెలుగు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో ఓ మంచి ఆఫర్ ఇవానాకి వచ్చినట్టు తెలుస్తోంది.