“హలో” సినిమాలో హీరో చిన్నప్పటి రోల్ చేసిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

“హలో” సినిమాలో హీరో చిన్నప్పటి రోల్ చేసిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

by kavitha

Ads

టాలీవుడ్  ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది బాల నటులుగా  అడుగు పెట్టి తమ నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొందరు చైల్డ్ ఆర్టిస్టులు కొన్ని చిత్రాలలో నటించినప్పటికి వారు చేసిన పాత్రలలో అద్భుతంగా నటించడం ద్వారా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నారు. అలాంటి బాల నటులలో మైఖేల్ గాంధీ కూడా ఒకరు.

Video Advertisement

అయితే ఈ పేరుని గుర్తుపట్టరమో కానీ, హలో మూవీలో హీరో చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి అనగానే వెంటనే గుర్తుకు వస్తాడు. హలో చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్, పలు సినిమాలలో నటించి ఆకట్టుకున్నాడు.  మైఖేల్ గాంధీ గురించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం..
child-artist-mikhail-gandhi1సుప్రీమ్ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మైఖేల్ గాంధీ వయస్సు ఆ సమయంలో 7 సంవత్సరాలు మాత్రమే. ఆ చిత్రం తరువాత పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మైఖేల్ గాంధీ సినిమాలలో  మాత్రమే కాకుండా పాకిస్తాన్, శ్రీలంకలకి చెందిన కొన్ని యాడ్స్ కూడా చేశాడు. అయితే అతనికి యాడ్స్ లో కన్నా  సినిమాలలో నటించడం అంటేనే ఇష్టమని ఒక సందర్భంలో తెలిపాడు.
child-artist-mikhail-gandhi3మైఖేల్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ యొక్క బయోపిక్ ‘ఎ బిలియన్ డ్రీమ్స్ ‘లో నటించి ఆకట్టుకున్నాడు. డినిలో మైఖేల్ నటన చూసి, సినిమా ఆఫర్స్ అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ ప్రమోషన్ టైమ్ లో మైకేల్ ఎక్కడికి వెళ్ళినా, అక్క డికి పెద్ద ఎత్తున జనాలు వచ్చేవారు. అప్పటికే అంతటి అభిమానాన్ని పొందాడు. సుప్రీమ్, ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రాలలో మైఖేల్ యాక్టింగ్ చూసిన అక్కినేని నాగార్జున ‘హలో’ మూవీలో హీరో అఖిల్ చిన్నప్పటి పాత్ర కోసం ఎంపిక చేసారు.
ఇక హలో చిత్రంలో మైఖేల్ నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తాను పెద్దయ్యాక హీరోగా కూడా ఎంట్రీ ఇస్తాడని మైఖేల్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మైఖేల్ గాంధీ వయసు 12 సంవత్సరాలు. అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. ఇంస్టాగ్రామ్ లో అతనికి 1444 మంది ఫాలోవర్స్ ఉన్నారు.

https://www.instagram.com/p/Cqitt-Utgw7/?hl=en

Also Read: “3D సినిమా అని చెప్పి సీరియల్ చూపించారు ఏంటి..?” అంటూ… “శాకుంతలం” సినిమా రిలీజ్‌పై 15 ట్రోల్స్..!


End of Article

You may also like