Ads
అక్కినేని నాగార్జున సినీ హిస్టరీ లో “గీతాంజలి” సినిమా కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కెరీర్ డౌన్ లో ఉన్న సమయం లో ఈ సినిమా ను చేసారు. ఈ సినిమా ఆరోజుల్లో సూపర్ హిట్ గా నిలిచింది. విభిన్నమైన ప్రేమ కథా చిత్రం గా ఈ సినిమా నేటి ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. అయితే ఈ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి గుర్తుందా.. గిరిజకు చెల్లెలి గా నటించిన ఈ అమ్మాయి పేరు నీనా పిళ్ళై. ఆమె ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసుకోండి.
Video Advertisement
ఈ సినిమా లో నీనా పిళ్ళై అద్భుతం గా నటించి అందరి అభిమానాన్ని పొందారు. నాగార్జున కు, గిరిజ ప్రేమ ను సపోర్ట్ చేసే పాత్ర లో నీనా పిళ్ళై నటించారు. బుడి బుడి అడుగులతో ఆమె నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆ పాప ముద్దు ముద్దు గా చెప్పిన డైలాగులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆరేళ్ళ కె నీనా పిళ్ళై చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యారు.
ఈ సినిమా తరువాత ఆమె ఎక్కువ తమిళ సినిమాలలో నటించారు. కాలమెల్లం కాతిరుప్పెన్, కెలడి కన్మని, రాశి వంటి సినిమాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే, 1997 లో ఆమె విడుకథై సినిమా లో హీరోయిన్ గా నటించారు.
ఆ తరువాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె తిరస్కరించారు. పలు టివి సీరియల్స్ లో కూడా ఆమె నటించారు. 2004 వ సంవత్సరం లో నీనా పిళ్ళై చందిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత వీరు ఆస్ట్రేలియా లో స్థిరపడ్డారు. వీరికి ఒక కూతురు సోనియా, కొడుకు సంజయ్ సంతానం కలిగారు. ఆమె ప్రతిభతో పలు అవకాశాలు తెచ్చుకున్నప్పటికీ.. ఆమె వివాహం తరువాత కుటుంబం తోనే సమయం గడుపుతోంది.
End of Article