“వేదం” లో “మంచు మనోజ్” పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

“వేదం” లో “మంచు మనోజ్” పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

by kavitha

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క శెట్టి, హీరో మంచు మనోజ్ నటించిన సినిమా ‘వేదం’. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Video Advertisement

2010లో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికి, అంతగా ఆడలేదు. కానీ మంచి చిత్రాలలో ఒకటిగా ‘వేదం’ నిలుస్తుందనే టాక్ వచ్చింది. ఈ మూవీని ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ‘ఆర్కా మీడియా వర్క్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో కూడా రీమేక్ చేయడం జరిగింది.
అనుష్క సరోజా అనే వేశ్య పాత్రలో, కేబుల్ రాజు క్యారెక్టర్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ రాక్ స్టార్ వివేక్ పాత్రలో అద్భుతంగా నటించి, ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించిన అనుష్క వేశ్య క్యారెక్టర్ చేయడం సాహసం అని చెప్పవచ్చు. కాగా ఈసినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించారు. అల్లు అర్జున్ పక్కన దీక్షా సేథ్, మంచు మనోజ్ పక్కన లేఖా వాషింగ్టన్ నటించారు. దీక్షా సేథ్ టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారు. కానీ లేఖా వాషింగ్టన్ వేదం మూవీ తరువాత ఎక్కువగా కనిపించలేదు. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..వేదం మూవీలో మంచు మనోజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన లేఖ ఆ మూవీ తరువాత కమినా, డైనమైట్ అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆమె నటి మాత్రమే కాదు కళాకారిణి మరియు ప్రొడక్ట్ డిజైనర్. ఆమె చెన్నై రంగస్థల నాటకాలలో కూడా నటించారు.  చేసింది. ప్రస్తుతం ఆమె అజ్జీ అనే ప్రోడక్ట్ డిజైన్ కంపెనీని నడుపుతున్నారు. బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘మాతృ కి బిజిలీ కా మండోలా’చిత్రంలో లేఖా వాషింగ్టన్ అతిధి పాత్రలో నటించింది.
ఇటీవల నటి లేఖా వాషింగ్టన్‌, ఇమ్రాన్ ఖాన్ తో కనిపించి వార్తల్లో నిలిచింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ మరియు లేఖ చేయి చేయి కలిపి నడుస్తున్న వీడియో వైరల్ గా మారింది.  ఈ క్రమంలో లేఖా వాషింగ్టన్ ఎవరు అని నెటిజెన్లు ఆమె గురించి తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు.

https://www.instagram.com/p/CNCRLGgpy8G/

Also Read: రియల్ TO రీల్..! అసలు నిజ జీవితంలో ఏం జరిగిందో తెలుసా..?


End of Article

You may also like