“ఒక్కడు” లో మహేష్ బాబు చెల్లిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా?

“ఒక్కడు” లో మహేష్ బాబు చెల్లిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా?

by Mohana Priya

Ads

మహేష్ బాబు కి స్టార్ డం తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తో పాటు గుణశేఖర్ దర్శకత్వం చార్మినార్ సెట్, పాటలు, ఫైట్స్, డైలాగులు ఇలా ఎన్నో హైలెట్ ల వల్ల సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఎంతో మందికి గుర్తుండిపోయింది. ఈ సినిమా ఇతర నటీనటులకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

Video Advertisement

Also read: “ఒక్కడు” సినిమాలో చెప్పిన ఆ నెంబర్ 9848032919 ఎవరిదో తెలుసా?

తన పేరు నిహారిక. చైల్డ్ ఆర్టిస్ట్ గా తను ఎన్నో సినిమాలు చేసింది. ఒక్కడు సినిమా కంటే ముందు ప్రేమించుకుందాం రా లో, మోహన్ బాబు నటించిన యమజాతకుడు లో, సీతారాముల కల్యాణం లో, అలాగే ఆకాష్ నటించిన ఒక సినిమాలో కూడా నటించింది. కానీ ఒక్కడు సినిమాతో ఇంకా ఎక్కువ మందికి పరిచయం అయింది.

Also read: ఒక్కడు సినిమాలో విలన్ గా ముందుగా ఆ హీరోని అనుకున్నారంట?

ఒక్కడు తర్వాత తను వేరే ఏ సినిమాలో కనిపించలేదు. జనాలు కూడా తనని మెల్లగా మర్చిపోయారు. తను ఎలా ఉంది ఎక్కడ ఉంది అన్న విషయాలు ఎవరికీ తెలియదు. 2013 లో తను హీరోయిన్ గా సినిమాల్లోకి వస్తుంది అన్న వార్త కొంతకాలం వినిపించింది. అది కూడా రూమర్ ఏమో అని తేల్చేశారు.

సడన్ గా కొద్ది రోజుల క్రితం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అని కొన్ని వెబ్సైట్ మరియు యూట్యూబ్ చానెల్స్ రాసారు. కానీ అందులో ఉన్నది నిహారిక కాదంట.? ఆ ఫోటోలు ఫేక్ అంట. ఆ ఫేక్ ఫోటోల వల్ల మరోసారి నిహారిక గురించి చర్చనీయాంశం అయ్యింది. కొందరు తను హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు తను ఈ పాటికి పెళ్లి చేసుకొని కుటుంబాన్ని చూసుకుంటూ ఉండచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 


End of Article

You may also like