తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హిట్ డైరెక్టర్ హీరో కాంబినేషన్ల లో పవన్ కళ్యాణ్ కరుణాకరన్ కాంబినేషన్ ఒకటి. వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి ప్రేమ చిత్రం అటు పవన్ కళ్యాణ్ కి ఇటు కరుణాకరన్ కి ఇద్దరికీ హిట్ ఇవ్వడమే కాకుండా మన ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమకథల్లో బెస్ట్ గా నిలిచిపోయింది.

Video Advertisement

తొలిప్రేమ సినిమా వచ్చి 22 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఆ సినిమా అంటే అదో రకమైన క్రేజ్ ఉంది. తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ లోనే బాలు సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన బాలు ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒక రౌడీగా, తర్వాత గతాన్ని వదిలేసి మరొక చోటికి వచ్చి కొత్త జీవితం మొదలు పెట్టిన వ్యక్తి బాలు గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు.

ఈ సినిమాకి మణిశర్మ సంగీతం, శ్రీయ, జయసుధ కూడా ప్లస్ పాయింట్స్. బాలు సినిమాలో మెరిసిన ఇంకొక క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో బాలు ప్రేమించే వ్యక్తి ఇందిరా ప్రియదర్శిని. అమాయకంగా, అన్నిటికీ భయపడుతున్నట్లు ఉంటూనే తన వాళ్ళ కోసం ధైర్యంగా నిలబడే ఇందిరా పాత్రను పోషించారు నేహా ఒబెరాయ్. సినిమాలో ఇందిర క్యారెక్టర్ చనిపోయినప్పుడు మాత్రం చాలామంది బాధపడ్డారు. ఆ పాత్ర మనకు అంతగా కనెక్ట్ అయింది.

బాలు నేహా ఒబెరాయ్ మొదటి సినిమా. బాలీవుడ్ లో ఎంతో పేరుపొందిన నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కూతురు నేహ. షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, కాబిల్, షూటౌట్ ఎట్ వదాలా వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల కు దర్శకత్వం వహించిన దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ సంజయ్ గుప్తా కూడా నేహకి బంధువు అవుతారు.

నేహా ఒబెరాయ్ మళ్లీ ఎప్పుడెప్పుడు  సినిమా చేస్తుందా అని బాలు సినిమా తో తనకి అభిమానులైన చాలామంది ఎదురు చూశారు. నేహా కూడా బాలు తర్వాత జగపతి బాబు తో బ్రహ్మాస్త్రం అనే సినిమాలో నటించింది. బ్రహ్మాస్త్రం చిత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు.

తర్వాత హిందీలో కూడా దస్ కహానియా,ఈ ఎం ఐ,వుడ్ స్టాక్ విల్లా, ఆస్మాన్ చిత్రాల్లో నటించారు నేహ. వుడ్ స్టాక్ విల్లా బాక్సాఫీసు దగ్గర విజయం సాధించకపోయినా కానీ ఈ సినిమాలో తన నటనకు నేహ ఎంతగానో ప్రశంసలు అందుకున్నారు. 14 డిసెంబర్ 2010 లో డైమండ్ వ్యాపారి అయిన విశాల్ షా ని పెళ్లి చేసుకున్నారు నేహ.

నేహ ప్రస్తుతం నోయిడా లో ఉన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కి మెంబర్ గా ఉన్నారు. భూమిక, జ్యోతిక లాంటి ఎంతో మంది హీరోయిన్లు మంచి పాత్రలతో ఇండస్ట్రీలోకి మళ్లీ  కం బ్యాక్ ఇచ్చారు. అదేవిధంగా నేహ కూడా తిరిగి ఇండస్ట్రీకి వచ్చి మళ్లీ ప్రేక్షకులందరినీ అలరించాలని ఆశిద్దాం.