Ads
ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయ్యారు హీరోయిన్ స్నేహ ఉల్లాల్. నిజానికి తను ముందు బాలీవుడ్ లో పరిచయం అయింది. బాలీవుడ్ లో సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. కరెంట్, సింహా లాంటి సినిమాల్లో నటించింది. నటిగా మంచి పేరు వచ్చినా.. విజయాలు వచ్చినా కూడా స్నేహాకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
Video Advertisement
ఈమెను ఫ్యాన్స్ ముద్దుగా జూనియర్ ఐశ్వర్య అని పిలిచుకుంటారు. అందంగా.. హాట్‌గా ఉన్నప్పటికీ.. సరైన హిట్స్ లేకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. బాలివుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో తొలి సినిమాతోనే అరంగేట్రం చేసినా అక్కడ కూడా సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రావడం తో పూర్తిగా వెండితెరకు దూరమైంది స్నేహ ఉల్లాల్. అలాగే కమిట్మెంట్స్ కి తాను దూరంగా ఉండటం వల్లే అవకాశాలు తగ్గాయని కూడా ఆమె గతం లో వెల్లడించారు. దీంతో ఇక 2014 తరువాత సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
చిన్న సినిమాల్లో కూడా ఆమె నటించేందుకు ఒప్పుకోలేదు. దీంతో వెండితెర కి దూరమైంది ఈ జూనియర్ ఐష్. సినిమాలకు దూరమైన స్నేహ ఉల్లాల్ సోషల్ మీడియాలో మాత్రం అదరగొడుతోంది. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే స్నేహ నిత్యం తన ఆలోచనలుతో పాటు.. తన ఫోటోలను ఫాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఆమెను చూసిన ఫాన్స్ ఈమె స్నేహ ఉల్లాల్ యేనా.. అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక చాలా కాలం తర్వాత ఆమె తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే 2020 లో ఆమెకు ఎక్స్పైరీ డేట్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది స్నేహ. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో ఐటెం సాంగ్స్ లో నటించాలని ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం గా సాగాలని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు.
End of Article