Ads
దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా మంది బాలీవుడ్ మోడల్స్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వారిలో సియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ ఒకరు. 2008లో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనింతే’ మూవీ మీ అందరికీ గుర్తుండొచ్చు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సియా గౌతమ్. ఆ మూవీలో సంధ్య అనే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది.
Video Advertisement
రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధక బాధలు, మంచి చెడులపై సెటైరికల్ సబ్జెక్టుతో తెరకెక్కించారు. నేనింతే మూవీలో సియా గౌతమ్ హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన అమ్మాయి పాత్ర చేశారు. ఇక రవితేజ డైరెక్టర్ కావాలనుకునే యువకుడి రోల్ చేశారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ చిత్రంలో నటించింది సియా గౌతమ్. అయితే ఆ సినిమా సక్సెస్ ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టలేదు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోవడంతో సియా గౌతమ్ మళ్లీ తెలుగులో కనిపించలేదు.
అయితే 2011లో కన్నడంలో ఓ సినిమా చేసిన సియా.. సుమారు 7 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ‘సంజూ’ మూవీలో నటించింది. చాలా కాలం తర్వాత పక్కా కమర్షియల్ మూవీలో సియా తళుక్కున మెరిశారు. తన కుటుంబం తో ముంబై లో నివసిస్తున్న సియా తాజాగా వివాహం చేసుకుంది. ఆ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా.. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి.
ఫిబ్రవరి 6 న సియా వివాహం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన బంధుమిత్రుల నడుమ ఆమె వివాహం ఘనంగా జరిగింది. సియా భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా కాగా అతను ముంబై బేస్డ్ బిజినెస్ మాన్ అని సమాచారం. అలాగే ఆమెకు సన్నిహితులుగా ఉన్న కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. హీరోయిన్ ప్రియమణికి సియా మంచి స్నేహితురాలు కాగా ఆమె వేడుకలో పాల్గొన్నారు. ఇక ఆమె వివాహం చేసుకున్న వార్త తెలిసి నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
End of Article