“యంగ్ టైగర్ ఎన్టీఆర్” ఎలాంటి డైట్ ఫాలో అవుతారో తెలుసా..?

“యంగ్ టైగర్ ఎన్టీఆర్” ఎలాంటి డైట్ ఫాలో అవుతారో తెలుసా..?

by kavitha

Ads

నందమూరి వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారారు. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌ పాన్ ఇండియా స్టార్ గా మారారు.

Video Advertisement

ప్రస్తుతం తార‌క్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ పాత ఫొటోలు, ఎన్టీఆర్  డైట్ మెనూ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి  ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్లిమ్ గా ఉన్నా,  గతంలో అశోక్, రాఖీ వంటి చిత్రాలలో అధిక బరువు ఉండేవారు. అయితే యమదొంగ మూవీ సమయంలో సన్నగా మారారు. ఇక ‘టెంపర్’ చిత్రంలో సిక్స్ ప్యాక్ తో కనిపించి ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మరింత ఫిట్ గా కనిపించాడు. ఎన్టీఆర్ బరువు తగ్గినప్పటి నుండి  డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ డైలీ ఒకే రకమైన ఫుడ్ ను తీసుకుంటున్నాడ‌ం. అందువల్లనే  ఎన్టీఆర్ బాడీ ఫిట్ గా ఉంటుందని అంటున్నారు. తారక్ ఉదయం నిద్ర లేవగానే యోగ, ఎక్ససైజ్, కార్డియో వంటివి 2 గంటల పాటు చేసేవారంట. తారక్  బ్రేక్ ఫాస్ట్ లో  రెండు గ్లాసుల రాగిజావను తప్పనిసరిగా తాగేవారంట. దాని తరువాత నీటిలో నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తినేవారంట. 2 లేదా 3 ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటాడ‌ట‌. లంచ్ సమయంలో భోజనంలో తప్పనిసరిగా నాటుకోడి, రాగిజావను చాలా ఇష్టంగా తింటారంట. రాత్రి డిన్నర్ కి తాజా పండ్లను మాత్రమే తీసుకుంటాడు.
మధ్యలో ఆకలిగా అనిపించినపుడు ఫ్రూట్ జ్యూస్ కానీ,  పండ్లను కానీ తింటారంట. ముఖ్యంగా తారక్ తన ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకునేవారంట. అదే విధంగా రెగ్యులర్ డైట్లో భాగంగా పండ్లను తీసుకునేవారంట. డైట్ లేని రోజుల్లో  తనకు చాలా ఇష్టం అయిన బిర్యానిని ఎన్టీఆర్‌ తినేవారంట. ఇదే డైట్ ను ఆయన ఫ్యామిలీ కూడా ఫాలో అవుతారట.

Also Read: SATHI GANI RENDU EKARALU REVIEW : పుష్ప ఫేమ్ “జగదీష్ ప్రతాప్ బండారి” హీరోగా నటించిన ‘సత్తి గాని రెండెకరాలు’ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 

 


End of Article

You may also like