Ads
డైరెక్టర్ అన్న తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అదే అభిప్రాయాన్ని వాళ్లు తెర మీద చూపిస్తారు. ఎంత సినిమాలని, వారి వ్యక్తిగత అభిప్రాయాలని పక్కన పెట్టినా కూడా, ఎక్కడో ఒకచోట ఆ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారు అనేది సినిమాలో కనిపిస్తుంది.
Video Advertisement
ఇందులో ముఖ్యంగా హీరోలని చూపించే విధానం ఒకటి. కొన్ని సినిమాల్లో కొంత మంది డైరెక్టర్లు హీరోలని చాలా రఫ్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఆ హీరోలు చేసే కొన్ని పనులు ప్రేక్షకులకి నచ్చవు. అందులో అర్జున్ రెడ్డి సినిమా ఒకటి.
సినిమా పరంగా అర్జున్ రెడ్డి అనేది తెలుగు ఇండస్ట్రీ మీద ఉన్న ఒక అభిప్రాయాన్ని మార్చిన సినిమా. తెలుగు ఇండస్ట్రీని ఇంకొక స్థాయికి తీసుకువెళ్లిన సినిమా. ఈ సినిమా తర్వాత ఎక్కడ ఎక్కడ వాళ్ళో అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడారు. అయితే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో అర్జున్ పాత్ర ప్రీతి పాత్రని చంప మీద కొట్టినట్టు చూపిస్తారు. ఈ సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా సందీప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
హిందీలో కూడా ఈ సీన్ ఉంది. అయితే ఈ సినిమాని చూసిన హిందీ క్రిటిక్స్ అందరూ కూడా కబీర్ పాత్ర ప్రీతి పాత్రని కొట్టడం మీద మండిపడ్డారు. ఇదే విషయంలో భాగంగా ఫిలిం కంపానియన్ యూట్యూబ్ ఛానల్ కి సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రముఖ క్రిటిక్ అనుపమ చోప్రా “సినిమాలో ఇలాంటి సీన్ చూపించారు కదా? దాని వెనుక ఉన్న అర్థం ఏంటి?” అని ప్రశ్న అడిగారు.
అంతే కాకుండా, “ఈ సీన్ మీద చాలా మంది తమ కోపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా మందికి నచ్చలేదు” అని అనుపమ చోప్రా చెప్పారు. దానికి సందీప్ రెడ్డి సమాధానం చెబుతూ, “ప్రేమ అనేది కండిషన్స్ లేనిది. కొట్టద్దు, ముట్టుకోవద్దు లాంటి కండిషన్స్ ప్రేమలో ఉండవు. నువ్వు నీ భాగస్వామిని స్వేచ్ఛగా ముట్టుకోలేనప్పుడు, స్వేచ్ఛగా నీ కోపాన్ని చూపించలేనప్పుడు అది కండిషన్స్ ఉన్న ప్రేమ అవుతుంది” అని అర్థం వచ్చేలాగా చెప్పారు.
అయితే, ఇలాంటి ఒక ప్రశ్నని మరొక డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్ ని కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు. అందుకు గౌతమ్ మీనన్ ఈ విధంగా సమాధానం చెప్పారు. ” ప్రేమని ఎక్కడో వెతుక్కోకూడదు. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అది వచ్చినప్పుడు స్వీకరించాలి తప్ప, రాకపోతే అవతలి వ్యక్తిని తిట్టడం లాంటివి చేయకూడదు. ఒక రిలేషన్ షిప్ లో ఒడిదుడుకులు ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా డిగ్నిటీతో ఎదుర్కోవాలి. వాళ్ల మీద అధికారం చూపించడానికి ప్రయత్నించకూడదు.”
“ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తారు. కానీ కోపంలో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో మనకే తెలియదు. కానీ అలా చేయకూడదు. మీ భాగస్వామి మీద ఎప్పుడూ చేయి ఎత్తకూడదు. ఇలాంటి విషయాలని సున్నితంగా పరిష్కరించుకోవాలి. ఒక అమ్మాయికి, అబ్బాయికి, లేదా, ఒక స్త్రీకి, పురుషుడికి మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ మహిళ లేకపోతే ఆ పురుషుడు లేడు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి” అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ రెండు విషయాలకి సంబంధించిన క్లిప్పింగ్స్ చర్చల్లో నిలిచాయి. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ గా చెప్పారు? నిజ జీవితంలో మీరు దేనికి సమర్థిస్తారు?
watch video :
whose ideology do you guys agree with?
VANGA or GVM pic.twitter.com/eiCmz7ci2y
— 𝐇𝐀𝐊𝐔𝐍𝐀-𝐌𝐀𝐓𝐀𝐓𝐀 (@noworriesbehpy1) December 12, 2023
ALSO READ : DEVARA:ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాం…. దేవర ప్రొడ్యూసర్ ప్రకటన…
End of Article