“పింక్” తమిళ్ రీమేక్ లో కూడా చేయని ఈ మార్పు… కేవలం “వకీల్ సాబ్” లో మాత్రమే ఎందుకు చేశారు..?

“పింక్” తమిళ్ రీమేక్ లో కూడా చేయని ఈ మార్పు… కేవలం “వకీల్ సాబ్” లో మాత్రమే ఎందుకు చేశారు..?

by Anudeep

Ads

వకీల్ సాబ్ సినిమా అందరికీ తెలిసిందే. 2016 లో వచ్చిన పింక్ సినిమాను రీమేక్ చేసారు. పింక్ లో అమితాబచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను తమిళ్ లో కూడా నేర్కొండ పార్వై అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో అజిత్ కుమార్, శ్రద్దా శ్రీనాథ్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు.

Video Advertisement

అయితే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నివేదా థామస్, అంజలి ప్రధాన పాత్రల్లో వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోని కథ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే..ఓ అమ్మాయి పట్ల ఓ మంత్రి కొడుకు అసభ్యంగా ప్రవర్తించబోతే, సీసాతో కొట్టి గాయపరుస్తుంది. దాంతో ఆ మంత్రి కొడుకు ఆ అమ్మాయిని తప్పుడు ఆరోపణలతో కోర్టుకు లాగి నానా యాగీ చేయడం. హీరో ఆ అమ్మాయిల తరపున వాదించి గెలిపించడం ఇది కథ.

అయితే ఓ సినిమాను రీమేక్ చేసేప్పుడు సన్నివేశాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పింక్ లో తాప్సీ అమితాబ్ పార్క్ లో నడుచుకుంటూ వెళ్లేప్పుడు కొంతమంది అబ్బాయిలు తనను కామెంట్ చేస్తారు వెంటనే తాప్సీ తన ఫేస్ ని మాస్క్ తో కవర్ చేస్తే.. అమితాబ్ దాన్ని తొలగిస్తాడు. ఇదే సీన్ ని తమిళ్ లో ఉన్నది ఉన్నట్టు తెరకెక్కించారు. అయితే వకీల్ సాబ్ లో మాత్రం అమ్మాయిని అబ్బాయిలు కామెంట్ చేసిన వెంటనే వాళ్ళను కొట్టడానికి పవన్ కళ్యాణ్ వెళ్తాడు.

నిజానికి ఒరిజినల్ లో అలా కొట్టే సీన్ ఉండదు. అది మన నెటివిటీకి తగినట్లు మార్చి ఉండొచ్చు లేదా పవన్ చరిష్మాకు, ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మార్చి ఉండొచ్చు. కానీ ఇతర భాషల్లో రియాక్ట్ అయ్యే విధానం మాత్రం అలా లేదు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇది ఇక్కడి పరిస్థితులకు అవసరం అని కొందరంటే.. కొంతమంది ఇది వరెస్టు రీమేక్ అని కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

https://www.instagram.com/reel/CeI7mmYD241/?igshid=YmMyMTA2M2Y=


End of Article

You may also like