Ads
ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన అనుభూతి. నిజమైన ప్రేమకు వ్యామోహానికి మధ్య చాలా తేడా ఉంటుంది కానీ నేటి తరం యువత వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటూ మోసపోతుంటారు. నిజమైన ప్రేమను కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందంగా ఒక వ్యక్తి కనిపిస్తే చాలు లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటూ చెప్పుకోస్తారు.
Video Advertisement
కానీ నిజమైన ప్రేమకు వ్యామోహానికి మధ్య ఎంతో తేడా ఉంది. ఎప్పుడైతే మీరు నిజమైన ప్రేమికులను గుర్తించగలుగుతారో వారి జీవితం ఎంతో సుఖమయంగా సాగిపోతుంది. కానీ పొరపాటున వ్యామోహాన్ని ప్రేమ అనుకోని మోసపోతారో వారి జీవితం నరకప్రాయం అయిపోతుంది.
ఇప్పుడు నిజమైన ప్రేమకు వ్యామోహానికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం
నిజమైన ప్రేమ అనేది హార్ట్ లో నుంచి వచ్చే ఫీలింగ్. అదే అట్రాక్షన్ అనేది మన బ్రెయిన్ లో ఫీలింగ్స్. చాలా మంది అట్రాక్షన్ ని ప్రేమ అనుకోని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎందుకంటే బ్రెయిన్ ని ఇంప్రెస్ చేయడం చాలా సులువు. కానీ హార్ట్ ని ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టమైన పని.
#1.
నిజమైన ప్రేమ అనేది ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు ఆనందంగా చూడాలనుకునేవారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం. అలా కాకుండా కేవలం తమ సంతోషం కోసమే ఆలోచించేవారు మీపై వ్యామోహం కలిగి ఉన్నవారని అర్థం.
#2.
నిజంగా ప్రేమ ఉన్నవారు మీకు ఉండే సమస్యలను తమ సమస్యలుగా, మీ బాధను తన బాధగా భావిస్తారు. మీకు ఉండే మెంటల్ స్ట్రెస్ దూరం చేయడానికి చూస్తారు. కేవలం మీపై వ్యామోహము ఉన్నవారు అయితే తమ అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకుంటారు.
#3.
మిమ్మల్ని నిజంగా ప్రేమించిన, మీరు అవతలవారి నిజంగా ప్రేమించిన ఒకరి స్వేచ్ఛను ఒకరు అర్థం చేసుకుంటుంటారు. మీ పై నమ్మకంతో మీరు ఏ పని చేసిన ఒప్పుకుంటారు. అదే మీపై అసత్య ప్రేమ కలవారైతే రూల్స్ తో కంట్రోల్ చేయడానికి చూస్తారు.
#4.
నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది మీ జీవితం చివరి క్షణం వరకు ఒకే విధంగా ఉంటుంది. మీరు ఎంత అందవిహీనమైన వాళ్ల మనసుకు ఎంతో అందంగా కనిపిస్తారు. అదే మీపై ఉన్నది కేవలం వ్యామోహము అయితే మీరు ఎంత అందంగా ఉన్న, మీలో కాలానుగుణంగా వచ్చే మార్పులవల్ల మిమ్మల్ని వదిలేయడానికి చూస్తారు.
#5.
మీ ప్రేమలో ఏ ఒక్కరికి ఈగో ఉన్నా సరే అది ఖచ్చితంగా విఫలమవుతుంది. ట్రూ లవ్ అనేది ఈగో ఇద్దరిలోనూ తగ్గించి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా చేస్తుంది. అదే అట్రాక్షన్.. ఇది ఒకరి పై ఒకరికి ఈగో పెంచుకుంటూ పోతుంది. నిజమైన ప్రేమ మీ చివరి ఊపిరి ఆగిపోయే వరకు ఒకే విధంగా కొనసాగుతోంది.
End of Article