కల్కి 2898 AD టీజర్ కి… ట్రైలర్ కి ఈ తేడాలు గమనించారా..? మార్చి మంచి పని చేశారుగా..?

కల్కి 2898 AD టీజర్ కి… ట్రైలర్ కి ఈ తేడాలు గమనించారా..? మార్చి మంచి పని చేశారుగా..?

by Harika

Ads

ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. ట్రైలర్ లో చాలా మంది నటీనటులు ఉన్నారు. సీనియర్ నటుల నుండి, యంగ్ నటుల వరకు చాలా మంది ఇందులో ఉన్నారు. ట్రైలర్ లో చూసింది కేవలం కొంత మందిని మాత్రమే. సినిమాలో ఇంకా చాలా మంది ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని, వైజయంతి మూవీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎన్నో భాగాలుగా విడుదల అవుతుంది అని సినిమా బృందం ముందే ప్రకటించారు.

Video Advertisement

difference in kalki 2898 ad teaser and trailer.

అందులో మొదటి భాగం ఈ సినిమా. దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్రైలర్ లో దీపికా పదుకొనే తన సొంత గొంతు డబ్బింగ్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. మొదటి సినిమాకే తన వాయిస్ తనే డబ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. రాజేంద్రప్రసాద్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్, మలయాళ నటి అన్నా బెన్, హర్షిత్ రెడ్డి, తమిళ నటుడు పశుపతి, ప్రదీప్ రావత్, కమల్ హాసన్ ఈ ట్రైలర్ లో కనిపించారు. వారితో పాటు నటి శోభన కూడా కనిపించారు. వీళ్లు మాతమే కాకుండా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

వారి పాత్రలు ఒక గెస్ట్ అప్పియరెన్స్ లాగా ఉంటాయని సమాచారం. కొన్నాళ్ల క్రితం ఈ సినిమా టీజర్ విడుదల ఆయన సంగతి తెలిసిందే. దాంతో పోల్చి చూస్తే ట్రైలర్ లో కొన్ని మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కలర్ గ్రేడింగ్ గురించి. టీజర్ లో కలర్ గ్రేడింగ్ చాలా డార్క్ గా ఉంది. కానీ ఇప్పుడు ఇది మార్చి కలర్స్ కొంచెం బ్రైట్ గా చేశారు. దాంతో ఫ్రేమ్ లోని బ్రౌన్ కలర్ గ్రేడింగ్ ఇంకా బ్రైట్ గా కనిపిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎంతో మంది గమనించారు. కలర్ గ్రేడింగ్ మార్చి మంచి పని చేశారు అని అంటున్నారు. సినిమాలో ఫ్రేమ్స్ కి ఇదే చాలా హైలైట్ చేసింది అని పొగుడుతున్నారు.


End of Article

You may also like