ఫైట్స్ నందు.. గురూజీ సినిమా ఫైట్స్ వేరయా!!

ఫైట్స్ నందు.. గురూజీ సినిమా ఫైట్స్ వేరయా!!

by Anudeep

Ads

టాలీవుడ్ డైరెక్టర్ లలో సినిమా మేకింగ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. కానీ పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక శైలి పాటిస్తుంటాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్.

Video Advertisement

ఈయన సినిమాల్లో ఫైట్స్ చూస్తుంటే.. ఆయన శైలి మనకి అర్ధం అవుతుంది. ఆయనకి ఎంతో పేరు తెచ్చిన అతడు  సినిమా నుండి ఆయన ఆ పంథా కొనసాగిస్తున్నారు. అదేంటి అంటే త్రివిక్రమ్ హీరో విలన్ ని డైరెక్ట్ గా కొట్టడు. విలన్ తో  ఉండే వాళ్ళని కొట్టడం ద్వారా విలన్ లో భయం పుట్టించి.. హీరో ఇజాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు.

అతడు సినిమాలో చూస్తే.. పొలం దగ్గర ఫైట్ సీన్ ఎవరు మర్చిపోలేము. అక్కడ మహేష్ మిగిలిన వాళ్ళని కొట్టడం ద్వారా, తనికెళ్ళ భరణిలో భయం పుట్టించి అతనిపై విజయం సాధిస్తాడు. తర్వాత సినిమా జల్సాలో కూడా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్, విలన్ ముఖేష్ రిషి ని కొట్టకుండా అతని అనుచరులతో ఫైట్ చేసి ముఖేష్ రిషిని కోట్టకుండానే కోమాలోకి పంపిస్తాడు.

ఖలేజా సినిమా క్లైమాక్స్ లోను,అనుష్కని వాళ్ళ నాన్న తనికెళ్ళ భరణికి అప్పగించే ఫైట్ సీక్వెన్స్ కూడా గమనిస్తే ఇదే ఫార్ములా ప్రకారం ఉంటాయి. తర్వాత వచ్చిన జులాయి క్లైమాక్స్ లో కూడా అల్లు అర్జున్, విలన్ సోనూ సూద్ అనుచరులు అందర్నీ చావగొట్టి సోనూ సూద్ ని భయంతో పరుగులు పెట్టించేలా చేస్తాడు.

అంతేగాక త్రివిక్రమ్ తన కెరీర్ లో అల్ టైమ్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది లో పవన్ తన అత్త నదియా ని పోసాని భారి నుండి కాపాడే సన్నివేషం లో కూడా పోసాని ని కొట్టకుండా కేవలం ఒక దెబ్బ తోనే భయపెడతాడు. ఆ సినిమా క్లైమాక్స్ లో అయితే విలన్ కోట శ్రీనివాసరావు అనుచరుల్ని రైల్వె స్టేషన్ లో చావగొట్టి, కోట అతని కొడుకు భయం తో న్యూస్ పేపర్ లో తల దాచుకునేలా చేస్తాడు.

ఇంకా గురూజీ ఇదే ఫార్ములా తన తర్వాత సినిమాలు అ ఆ, అల వైకుంఠపురంలో, అరవింద సమేతలో కూడా సందర్భాను సారంగా వాడడం జరుగుతుంది. త్రివిక్రమ్ నమ్మేది హింసించడం కన్నా భయపెట్టడమే హీరోయిజం అని, అందుకే తన ప్రతి సినిమాలో హీరో విలన్ ని భయపెట్టే విధంగా తన యాక్షన్ సీక్వెన్స్ ని రూపొందిస్తున్నారు. స్టంట్ మాస్టర్ ఎవరైనా యాక్షన్ సీన్ ఏదైనా గురూజీ తన మార్క్ మాత్రం పాటిస్తుంటారు. అందుకే తెలుగు సినీ ప్రేక్షకులు “ఫైట్స్ నందు గురూజీ సినిమా ఫైట్స్ వేరయా”…  అంటున్నారు మూవీ లవర్స్.


End of Article

You may also like