టాలీవుడ్ లో విచిత్రమైన టైటిల్స్ పెట్టిన 15 సినిమాలు..చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

టాలీవుడ్ లో విచిత్రమైన టైటిల్స్ పెట్టిన 15 సినిమాలు..చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

by Anudeep

సినిమా అట్ట్రాక్ట్ అవ్వాలి అంటే టైటిల్ చాలా ముఖ్యమైనది. టైటిల్ రిలీజ్ చేయగానే… ఆ టైటిల్ ని బట్టే చాలా వరకు సినిమా కి హైప్ వస్తుంది. అందుకే దర్శకులు కూడా టైటిల్ విషయం లో చాలా జాగ్రత్త గా ఉంటారు. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు.

Video Advertisement

తాజాగా, విడుదల అయినా “లైగర్” టైటిల్ ను కూడా అలా డిఫరెంట్ గా ఉండాలి అని భావించి పెట్టారు. పాజిటివ్, నెగటివ్ అన్న సంగతి పక్కన పెడితే.. ఈ టైటిల్ కి ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే కదా.. అలా.. లైగర్ మొదటి సినిమా ఏమి కాదు.. ఇలా చిత్ర విచిత్రం గా టైటిల్ పెట్టుకున్న సినిమాలు టాలీవుడ్ లో గతం లో కూడా రిలీజ్ అయ్యాయి.. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

1. లైగర్:

liger poster
లయన్ + టైగర్ ను కలిపి “లైగర్” అనే పేరు పెట్టి సినిమా టైటిల్ గా అనౌన్స్ చేసారు. సాలా క్రాస్ బ్రీడ్ అని కాప్షన్ ను జత చేసారు. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ డైరెక్షన్ చేస్తుండగా.. విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్నాడు.

2. అప్పారావు డ్రైవింగ్ స్కూల్:

apparao driving school
ఈ సినిమా నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిది. హీరోయిన్లు గా ప్రీతీ జాహ్నవి, మాళవిక నటించారు. ఈ సినిమా 2004 లో వచ్చింది.

3. పట్నం వచ్చిన పతివ్రతలు:

2 patnam vachhina pativratalu
ఇది మన మెగాస్టార్ సినిమా. టాలీవుడ్ మిత్రులు మెగాస్టార్, మోహన్ బాబు హీరోలు గా, రాధికా శరత్ కుమార్, గీత హీరోయిన్లు గా నటించిన సినిమా. 1982 లో వచ్చింది ఈ సినిమా.

4. కాలాంతకులు:

3 kalanthakulu
ఇది చాలా పాత సినిమా. 1978 లో వచ్చింది. శోభన్ బాబు, కైకాల సత్యనారాయణ, జయసుధ ఈ సినిమా లో నటించారు.

5. మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది:

Maa Aavida Meedha Ottu Mee Aavida Chala Manchidhi
ఈ సినిమా నైంటీస్ (1990) కిడ్స్ కి తెలిసే ఉంటుంది.. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలు గా నటించారు.

6. జూలకటక:

Julakataka
ఇప్పుడంటే ఈ పేరు ఏదో టివి షో లో కనిపిస్తోంది కానీ, ఈ పేరుతొ సినిమా ఉందండోయ్. మన రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కి హీరో. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అంటే ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది మరి.

7. వద్దు బావ.. తప్పు..!

6 vaddu bava tappu
ఇది కూడా మన రాజేంద్ర ప్రసాద్ దే. ఆరోజుల్లో ఆయన సినిమాల్లో కామెడీ కి పెద్ద పీట వేసేవారు. ఈ సినిమా కూడా చాలా కామెడీ గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

8. కీచురాళ్ళు :

7 keechurallu
ఈ సినిమా పేరు కూడా వెరైటీ గా ఉంది కదా. 1991 లో వచ్చింది ఈ సినిమా. భాను చందర్, శరత్ బాబు, శోభన, బ్రహ్మానందం, బేబీ షాలిని ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

9. జంబలకిడి పంబ:

8 Jamba Lakadi Pamba
ఈ పేరే కాదు ఈ సినిమా కూడా ఆరోజుల్లో చాలా విచిత్రం గా అనిపించింది. కానీ బాగానే ఆడింది అనుకోండి. ఈ సినిమా లో కామెడీ కి మనం ఇపుడు కూడా నవ్వుకుంటాం. ఇదే టైటిల్ తో కమెడియన్ శ్రీనివాస్ హీరో గా కూడా ఓ సినిమా రిలీజ్ ఐంది.

10. పెళ్ళానికి ప్రేమ లేఖ ప్రియురాలికి శుభలేఖ:

9 Pellaniki Prema Lekha Priyuraliki Subhalekha
ఈ సినిమా 1992 లో వచ్చింది. మంచి కామెడీ సినిమా. ఈ సినిమాలో హీరో కూడా రాజేంద్ర ప్రసాద్ గారే. శృతి , నందిని ఈ సినిమాలో హీరోయిన్లు గా నటించారు.

11. కొబ్బరి బొండం:

10 Kobbari_Bondam
టైటిల్ చూడగానే ఒక్కసారి గా సంపూర్ణేష్ బాబు సినిమా కొబ్బరి మట్ట గుర్తొచ్చింది కదా.. అది వేరు అండి. ఈ సినిమా ఓల్డెన్ డేస్ లో నే వచ్చింది. ఇంత వెరైటీ టైటిల్ సినిమాలో హీరో కూడా మన రాజేంద్ర ప్రసాద్ గారే.

12. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి

11 Sahasra Siracheda Apporva Chinthamani
అబ్బో..ఇది చాలా పాత సినిమా అండి. 1947 లో వచ్చింది. ఈ చింతామణి కధలు మాత్రం చాలా పాపులర్. ఈ సినిమా కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. యు ట్యూబ్ లో ఈ సినిమాని చూడచ్చు. రాజనాల, కాంతారావు, కైకాల సత్యనారాయణ, దేవిక ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

13. రామాచారి వీడో పెద్ద గూఢచారి

12 RamaChari Veedo Pedha Gudachari
ఈ సినిమా లో హీరో వేణు అండి. కమెడియన్ వేణు కాదు.. ఈ హీరో పేరు కూడా వేణు నే. అప్పట్లో మంచి రోల్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా లో కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది.

14. విచిత్ర దాంపత్యం:

13 Vichitra Daampatyam
ఇది కూడా చాలా పాత సినిమా. శోభన్ బాబు, సావిత్రి, విజయ నిర్మల ఈ సినిమా లో కీలక పాత్రలు పోషించారు.

15. అతను హార్డ్ వేర్ ఆమె సాఫ్ట్ వేర్

Athanu Hardware Aame Software

ఈ టైటిల్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా. రాజా ఈ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. చంద్రమోహన్, ఎమ్ ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్ ఈ సినిమా లో కీలక పాత్రలు పోషించారు.


You may also like