Ads
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగులో వారసుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట వైరల్ గా మారింది.
Video Advertisement
కమర్షియల్ హంగులతో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. పైగా రోజురోజుకు విజయ్ పాపులారిటీతో పాటు ఆయన సినిమాల మార్కెట్ రెట్టింపవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారసుడు సినిమా బిజినెస్ విషయమై దిల్ రాజు బెస్ట్ డీల్స్ చేస్తున్నారట.
ఈ సినిమా నాన్ థియేట్రికల్, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తెలుస్తోంది. అయితే తెలుగులో మాత్రం స్వయంగా తానే ఈ సినిమా హక్కులు తీసుకొని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు.
ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. అదే సమయంలో విడుదల కాబోతున్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య” మరియు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” సినిమాలతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుండటం జనాల్లో మరింత ఆసక్తి పెంచింది.
మహర్షి సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
source:https://twitter.com/sekartweets/status/1587270790776786944
End of Article