దిల్ రాజు వర్సెస్ మైత్రి ….ఈ పోటీ ఆగదేమో…!

దిల్ రాజు వర్సెస్ మైత్రి ….ఈ పోటీ ఆగదేమో…!

by Mounika Singaluri

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య, దర్శకుల మధ్య, హీరోలు మధ్య పోటీ అనేది సార్వసాధారణం. అయితే ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్ మధ్య కూడా పోటీ వాతావరణం నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎప్పటినుండో డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో చాలా థియేటర్లు ఆయన కంట్రోల్ లో ఉంటాయి. ఏ సినిమా రిలీజ్ చేయాలన్న దిల్ రాజు హ్యాండ్ ఉండాల్సిందే.

Video Advertisement

అయితే ఇప్పుడు దిల్ రాజుకి పోటీగా నైజం లో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు. క్రితం సంవత్సరం సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ తమ సొంత సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాయి. అయితే దిల్ రాజు కూడా తన సొంత సినిమా వారసుడు నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ విషయంలో ఇద్దరు మధ్య ధియేటర్లు విషయంలో పోటీ నెలకొంది.

అయితే వీరి మధ్య పోటీ అనేది ఇలా కొనసాగుతూనే వస్తుంది అది ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా కనిపిస్తుంది. దిల్ రాజు మహేష్ బాబు గుంటూరు కారం డిస్ట్రిబ్యూట్ చేయనుండగా, మైత్రి మూవీ మేకర్ హనుమాన్ అనే చిన్న సినిమానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ధియేటర్ల విషయంలో మళ్ళీ పోటీ వాతావరణం నెలకొంది. దిల్ రాజు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని మైత్రి మూవీ మేకర్ పోటాపోటీగా వస్తుందంటూ సినీ పండితులు చెబుతున్నారు


You may also like

Leave a Comment