తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారు. తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ, ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ బాధ్యత కూడా వహిస్తూ అంచెలంచెలుగా పైకి ఎదిగారు.దిల్ రాజు మొదటి భార్య అనిత. వాళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉన్నారు. 2017 లో అనిత గారు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. భార్య మరణం తర్వాత దిల్ రాజు కొంతకాలం పాటు మీడియా కి దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ తన సినిమా నిర్మాణ పనులను నిర్వహిస్తూ ఆ సినిమాల ప్రచారం కోసం బయట కూడా కనిపిస్తున్నారు.

Video Advertisement

Dil Raju Marriage Photos

Dil Raju Marriage Photos

లాక్ డౌన్ సమయం లో మే నెలలో దిల్ రాజు తేజస్విని ని రెండో పెళ్లి చేసుకున్నారు. ఏ హంగు ఆర్భాటం లేకుండా ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు, తేజస్విని కి సంబంధించిన ముఖ్యమైన వాళ్లను తప్ప ఎక్కువ మందిని పిలవలేదు. కానీ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. అంతేకాకుండా ఇటీవల దిల్ రాజు, తేజస్విని తో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

తెలుగులో ఇప్పటికే టాప్ స్థానంలో ఉన్న దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టబోతున్నారు. ఎఫ్ 2 రీమేక్, హిట్ రీమేక్ తో పాటు తెలుగులో కూడా వకీల్ సాబ్, ఇంకా కొన్ని సినిమాలు నిర్మించనున్నారు..