Ads
టి20 ప్రపంచకప్ 2022ను ముగించుకున్న టీమిండియా న్యూజిలాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ లకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నవంబర్ 18, 20, 22వ తేదీల్లో మూడు టి20ను ఆడనుంది. అనంతరం నవంబర్ 25, 27, 30వ తేదీల్లో మూడు వన్డేలను ఆడనుంది. టి20లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. ఇక వన్డేలకు శిఖర్ ధావన్ సారథిగా ఉండనున్నాడు.
Video Advertisement
అయితే టి20 ప్రపంచకప్ 2022 లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. హాట్ ఫేవరెట్ గా టోర్నీలో ఎంటర్ అయిన భారత్ సెమీస్ తో సరిపెట్టుకుంది. సెమిస్ లో భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యం లో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐపీఎల్ లో అదరగొట్టిన హర్షల్ పటేల్.. డెత్ ఓవర్స్ స్పెషలిస్టుగా టీమిండియాలోకి వచ్చాడు. అయితే ఈ టోర్నీ లో హర్షల్ తో ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవటం తో పై విమర్శలు వచ్చాయి.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా బీసీసీఐ ఎలెక్టర్లు 15 మంది సభ్యులను ఎంపిక చేయగా, 13 మందికి తుది జట్టులో అవకాశం దక్కింది. కానీ చాహల్, హర్షల్ పటేల్ మాత్రం అటు వరల్డ్ కప్ లో భాగంగా ఒక్క మ్యాచ్లో కూడా తుది జట్టులో అవకాశం దక్కించుకోకపోవడం గమనార్హం. అయితే అశ్విన్ అటు ప్రతి మ్యాచ్ లో విఫలం అవుతున్నప్పటికీ చాహల్ను మాత్రం తుదిజట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు పెద్దగా మొగ్గు చూపలేదు.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక క్రీడా చానల్ తో మాట్లాడిన దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో అద్భుతమైన వాతావరణాన్ని కల్పించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తుది జట్టులో స్థానం దక్కని వారిద్దరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉండేవారు అంటూ చెప్పుకొచ్చాడు.
“చాహల్, హర్షల్ పటేల్ లు మాత్రమే ఈ టి20 ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని భారత ఆటగాళ్లు. అయితే వారేమీ ఆగ్రహానికి గురికాలేదు. నిరుత్సాహపడలేదు. ఎందుకంటే టోర్నీ ప్రారంభానికి ముందే గడ్డు పరిస్థితుల్లో ఆడుతున్నాం అన్న విషయాన్ని కోచ్, కెప్టెన్ వారికి వివరించి చెప్పారు. ఇక చోటు దక్కని వారిలో నెగటివ్ ఆలోచనలకు తావులేకుండా చేశారు” అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
End of Article