Ads
తక్కువ టైం లో టాప్ డైరెక్టర్ల ప్లేస్ లోకి వెళ్లిపోయిన వారిలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన అనిల్ రావిపూడి వరుసగా సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో హిట్లు కొట్టి తక్కువ టైం లోనే స్టార్ డైరెక్టర్ అయ్యారు. రాబోయే ఎఫ్ 3 సినిమా కూడా హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీనితో.. ఈ సారి కూడా అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడబోతోంది.
Video Advertisement
ఫుల్ జోష్ లో కెరీర్ లో దూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రియల్ లైఫ్ లో ఓ ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ కూడా ఉంది. అదేంటో ఈ ఆర్టికల్ లో చూసేయండి.
కాలేజీ డేస్ లో చదువుకుంటున్న రోజుల్లోనే అనిల్ రావిపూడి ఓ అమ్మాయికి సైట్ కొట్టేవారట. అయితే.. ఆ తరువాత ఆ అమ్మాయి బ్యాచ్ లోనే ఉన్న మరో అమ్మాయితో అనిల్ రావిపూడి పెళ్లి జరిగిందట. ఏపీలోని ప్రకాశం జిల్లా యద్దనపూడి చెందిన అనిల్ రావిపూడి, ఆయన భార్య ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. అనిల్ రావిపూడి తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ప్రతి రోజు ఓ నలుగురు అమ్మాయిలు ఉన్న బ్యాచ్ ను చూస్తూ ఉండేవారట. అనిల్ రావిపూడి వారిలో ఓ అమ్మాయికి సైట్ కొట్టేవారట.
అయితే.. ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ గా ఉండడంతో.. అనిల్ రావిపూడి వైపు చూసేదే కాదట. అయితే.. ఆ తరువాత చదువు పూర్తయ్యాక అదే బ్యాచ్ లో ఉన్న మరో అమ్మాయితో అనిల్ రావిపూడికి పెళ్లి నిశ్చయమైంది. అనిల్ రావిపూడి భార్య ఇప్పటికీ ఈ విషయమై అనిల్ ను ఆటపట్టిస్తూనే ఉంటారట. కాలేజీ డేస్ లో నన్ను చూడకుండా వేరే అమ్మాయిని చూసారు అంటూ ఆటపట్టిస్తారట. ఈ విషయాన్నీ ఇటీవల ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్న టైంలో అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు ఫామిలీ లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
End of Article