“ఉప్పెన” చేయడానికి “వైష్ణవ్ తేజ్” పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా.? “విజయ్ దేవరకొండ” ని అనుకుని ఎందుకు డ్రాప్ అయ్యారు.?

“ఉప్పెన” చేయడానికి “వైష్ణవ్ తేజ్” పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా.? “విజయ్ దేవరకొండ” ని అనుకుని ఎందుకు డ్రాప్ అయ్యారు.?

by Anudeep

Ads

ఓ సినిమా రిలీజ్ అవ్వాలంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. షూటింగ్ ను నెలల్లోనే పూర్తి చేసినా.. కథ మొదలు, కధనం పూర్తి అయ్యేదాకా దర్శకుడు టెన్షన్ పడుతూనే ఉంటాడు. మొదట కథ కోసం, తరువాత పాత్రల కోసం, తరువాత నటన కోసం.. ఇలా సినిమా పూర్తి అయ్యి హిట్ టాక్ వచ్చేవరకు దర్శకుడి తపన ఓ రేంజ్ లో ఉంటుంది. “ఉప్పెన” సినిమా కోసం కూడా దర్శకుడు అలానే తపనపడ్డాడు.

Video Advertisement

uppena 4

సినిమాకి కథ ను రాసేసుకుని హీరో కోసం వెతికాడు. ఈ సినిమాలో కధే హీరో. కథని నమ్మి పాత్రకి ప్రాణం పొసే హీరో కోసం అతను వెతుకుతూనే ఉన్నాడు. ఉప్పెన సక్సెస్ కావడం తో దర్శకుడు బుచ్చిబాబు ఆనందానికి హద్దుల్లేవు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. ఈ సినిమా కథను రాసేసుకున్నాక తొలుత హీరో గా విజయ్ దేవరకొండను సంప్రదించాలనుకున్నారట. కానీ, అప్పటికే.. అర్జున్ రెడ్డి సినిమా తో విజయ్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ కధకు ఆయన సరిపోడు అని డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారు.

uppena 1

దీనితో, హీరో కోసం వెతుకులాట ప్రారంభించగా.. ఇన్స్టాగ్రామ్ లో వైష్ణవ్ తేజ్ ఫోటో ను చూశారట. అయితే, అతన్ని హీరో గా తీసుకునే ముందు ఆయన గురువు అయినా సుకుమార్ సలహా అడిగారట. ఈ కథ కి మెగా కాంపౌండ్ హీరోగా అంటే.. అంటూ ఆయన ఓ వైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే.. కధలో కంటెంట్ ఉంది అంటూ యాక్సెప్ట్ చేశారట. అయితే వాళ్ళు రిజెక్ట్ చేసిన పర్లేదు.. కానీ వాళ్ళు ఒకే చెప్పాక మనం రిజెక్ట్ చేయకూడదు.. కాబట్టి ముందు నువ్వు వైష్ణవ్ ని అబ్సర్వ్ చెయ్యి అని సుకుమార్ సలహా ఇచ్చారట.

uppena 3

అలా, రంగస్థలం ఎడిటింగ్ టైం స్పాట్ కి వచ్చిన వైష్ణవ్ తేజ్ ని బుచ్చిబాబు రోజు అబ్జర్వ్ చేశారట. పెళ్లి చూపులకి కుర్రాడిని చూసినట్లు సినిమా కి ముందు వైష్ణవ్ ను అబ్జర్వ్ చేశా అంటూ బుచ్చిబాబు ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. అలా వైష్ణవ్ ని అబ్జర్వ్ చేసాక ఈ సినిమాకి సరిపోతాడు అనిపించాక.. అప్పుడు కథను చెప్పాడట. అయితే, కథ వైష్ణవ్ కి బాగా నచ్చేసింది. కానీ, వైష్ణవ్ ఈ సినిమా చిరు యాక్సెప్ట్ చెయ్యాల్సిందే అని పట్టు బట్టాడు.

uppena

దీనితో, చిరు సర్ కి కథ చెప్పడానికి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్లే ప్రిపేర్ అయ్యా బుచ్చిబాబు ఆరోజుల్ని గుర్తు చేసుకున్నారు. మొత్తానికి, ఓ వారం రోజులు డైలాగ్స్ అన్ని ప్రిపేర్ అయ్యి.. మెంటల్ గా ఫిక్స్ అయ్యి చిరు సర్ కి కథను చెప్పాను.. చిరు సర్ కి కూడా ఈ కథ బాగా నచ్చడం తో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది అంటూ బుచ్చిబాబు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

watch video:

 

 


End of Article

You may also like