సమంత ‘శాకుంతలం’ చిత్రంలో ఎన్ని కిలోల బంగారు నగలు ధరించిందో తెలుసా?

సమంత ‘శాకుంతలం’ చిత్రంలో ఎన్ని కిలోల బంగారు నగలు ధరించిందో తెలుసా?

by kavitha

Ads

దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పౌరాణిక సినిమా  శాకుంతలం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో శాకుంతలం ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

Video Advertisement

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రంలో వాడిన బంగారు ఆభరణాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం కోసం దాదాపు 14 కోట్లు విలువ చేసే ఖరీదైన బంగారు వజ్రాల నగలను ఉపయోగించినట్లు వెల్లడించారు. దాన వీర శూరకర్ణ చిత్రంలో ఎన్టీ రామారావుగారు వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితో ఈ చిత్రంలో యాక్టర్స్ ధరించిన నగలను బంగారు, వజ్రాలతో తయారుచేయించామని తెలిపారు.
 పాపులర్ జ్యువెలరీ డిజైనర్ అయిన నీతు లుల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని వసుంధర జ్యువెలర్స్ శాకుంతలం చిత్రం కోసం ప్రత్యేకంగా ఏడు నెలలు కష్టపడి ఈ బంగారు నగలను తయారు చేశారని వెల్లడించారు. శాకుంతలం చిత్రంలో హీరోయిన్ సమంత పదిహేను కిలోల బంగారు నగలను ధరించారని చెప్పారు. వాటిలో దాదాపు పద్నాలుగు రకాల నగలను సమంత వేసుకుందని దర్శకుడు గుణశేఖర్ తెలియచేశారు. దుష్యంతుడి క్యారెక్టర్ చేసిన నటుడు దేవ్ మోహన్ ధరించడానికి  8-10 కిలోల స్వర్ణాభరణాలను డిజైన్ చేయించామని తెలిపారు.
మేనక పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ మధుబాల దాదాపు 6 కోట్లు ఖరీదు చేసే వజ్రాలతో డిజైన్ చేసిన దుస్తులు ధరించారని వెల్లడించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా శాకుంతలం సినిమాలో శకుంతల మరియు దుష్యంతుడు ధరించిన బంగారు నగలను వసుంధర జ్యువెలర్స్ లో ప్రదర్శించారు. ఈ విధంగా శాకుంతలం చిత్రంలో 14 కోట్ల ఖరీదు చేసేటువంటి బంగారు మరియు వజ్రాభరణాలను ఉపయోగించారని డైరెక్టర్ గుణశేఖర్ వెల్లడించారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: “టక్కరి దొంగ” సినిమా సెట్‌లో ఫోటో దిగిన ఈ బాబు… ఇప్పుడు పెద్ద “హీరో” అయ్యాడు..! ఎవరో తెలుసా..?


End of Article

You may also like