పవన్ ‘తీన్‌ మార్’ ఫ్లాప్‌ కావడం పై 12 ఏళ్ల తరువాత దర్శకుడి కామెంట్స్..! ఏం అన్నారంటే..?

పవన్ ‘తీన్‌ మార్’ ఫ్లాప్‌ కావడం పై 12 ఏళ్ల తరువాత దర్శకుడి కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ గురించి నేటి తరం ఆడియెన్స్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ    90 లలోని తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం ద్వారా డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన జయంత్ సి పరాన్జీ, ఆ తరువాత అనేక అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Video Advertisement

తన సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువ అయిన జయంత్ సి పరాన్జీ చివరిగా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించిన ‘తీన్ మార్’ అనే మూవీకి దర్శకత్వం చేశారు. అయితే ఈ మూవీ ప్లాప్ అయ్యింది. తాజాగా జయంత్ సి పరాన్జీ ఒక ఇంటర్వ్యూలో ఆ మూవీ ప్లాప్ కు కారణం చెప్పారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1997లో ప్రేమించుకుందాం రా సినిమాతో దర్శకుడిగా జయంత్ సి పరాన్జీ, ఆమూవీ హిట్ తో వరుస అవకాశాలు అందుకుని, టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ సినిమాలను చేశారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష హీరోహీరోయిన్లుగా ‘తీన్ మార్’ అనే సినిమాని చేశారు. ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది. ఇక ఆ మూవీ తరువాత జయంత్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జయంత్ ‘తీన్‌మార్‌’ ప్లాప్ కావడం పై స్పందించారు. జయంత్ మాట్లాడుతూ ‘ తీన్‌మార్‌ సినిమా నాకు ఇప్పటికీ, ప్రెష్‌ ప్రేమకథగానే అనిపిస్తుంది. ఈ మూవీ ప్లాప్ అవడానికి కారణాలు అయితే చెప్పలేను. కానీ ఈ సినిమా వల్ల కొందరు పవన్ ఫ్యాన్స్‌ నిరాశ పడ్డారు.అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిన్ త్రిషకు సోనూసూద్‌తో పెళ్లి కావడం, ఆ తర్వాత త్రిష మళ్ళీ పవన్‌ కల్యాణ్‌ వద్దకు రావడం వంటి సన్నివేశాలు ఆడియెన్స్ కి నచ్చలేదు. పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఈ సినిమాలో చూడలేక పోయారు. ఇదే సినిమాని ఆ సమయంలోని యంగ్ హీరోతో తెరకెక్కించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది కావచ్చు” అని అన్నారు.

Also Read:  “రంగస్థలం”లో ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.? రామలక్ష్మి చెప్పినప్పుడు ఎందుకు అర్థం కాలేదు అనుకుంటున్నారా.?


End of Article

You may also like