ప్రేమకోసం సినిమా ఫీల్డ్ ని వదిలేసాడు…పెళ్లి తర్వాత ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యారు.! ఎవరంటే.?

ప్రేమకోసం సినిమా ఫీల్డ్ ని వదిలేసాడు…పెళ్లి తర్వాత ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యారు.! ఎవరంటే.?

by Harika

జీతు జోసెఫ్ మలయాళం లో ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్. డిటెక్టివ్ సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన జీతూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. 2010లో ఇతను డైరెక్ట్ చేసిన చిత్రం మమ్మీ అండ్ మీ. ఇది మలయాళం సినీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చిత్రం. ఇక ఇతను డైరెక్షన్లో వచ్చిన సినిమా దృశ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇతనికి ఎంత పాపులారిటీని తీసుకువచ్చిందంటే బాలీవుడ్లో సైతం ఈ సినిమాని తీసి సక్సెస్ కొట్టాడు. దృశ్యం సినిమా మలయాళం సినీ రికార్డులని కొత్తగా తిరగరాసింది.

Video Advertisement

అలాంటి ఒక స్టార్ డైరెక్టర్ తన ప్రేమ కోసం సినీ ఫీల్డ్ ని వదిలేసుకున్నాడు అనే విషయం మీకు తెలుసా. ఆ కధేమిటో ఒకసారి చూద్దాం. జీతూ జోసెఫ్ తండ్రి కేరళలో పేరున్న ఎమ్మెల్యే ఇంటర్ చదువుతున్న సమయంలో జీతూ జోసెఫ్ కి అందరి కుర్రాళ్ళ లాగానే సినిమా పిచ్చి పట్టింది. ఇదే విషయం ఇంట్లో చెప్తే ముందు డిగ్రీ పూర్తి చేయు అన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఒకసారి చర్చిలో లిండా అనే అమ్మాయిని చూసి బాగా నచ్చటంతో వెళ్లి ప్రపోజల్ చేశాడు.

అయితే ఆ అమ్మాయి లైట్ తీసుకుంది కానీ జీతూ మాత్రం సీరియస్గా తీసుకొని నెక్స్ట్ టైం తన పేరెంట్స్ ని తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఆశ్చర్య పోవడం లిండా వంతు అయింది. లైఫ్ లో నువ్వు ఏం చేస్తావు అని లిండా అడిగినప్పుడు జీతూ సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. సినిమా వాళ్ళంటే మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి నేను కావాలో సినిమాలు కావాలో తేల్చుకో అని లిండా అడిగేసరికి ప్రేమించిన అమ్మాయి కోసం సినిమాలను వదిలేసాడు జీతూ.

కానీ పెళ్లి తర్వాత జీతూకి ఉన్న సినిమా తపన చూసిన లిండా తానే సినిమాల్లోకి వెళ్ళమని భర్తని ప్రోత్సహించింది. అప్పుడు జీతు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు, తర్వాత ఒక కథ రాసుకుని నిర్మాత దొరకక ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత జీతు జోసెఫ్ వాళ్ళ అమ్మ తన ఆస్తి ఇచ్చి సినిమా తీయమనడంతో డిటెక్టివ్ సినిమా తీసి హిట్ కొట్టాడు అక్కడి నుంచి అతని విజయప్రస్థానం ప్రారంభమైంది.


You may also like

Leave a Comment