Ads
ఒక సినిమా ప్రజెంట్ చేయడానికి కావలసిన ముఖ్యమైన వ్యక్తి హీరో అయితే, అసలు ఒక సినిమా ఆలోచన రావడానికి ముఖ్యమైన వ్యక్తి దర్శకుడు. తనకి వచ్చిన ఆలోచనని ఒక కథ రూపంలో డిజైన్ చేసి, తర్వాత స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తారు ఒక డైరెక్టర్. ఆ సినిమా రూపొందిస్తున్న సమయంలో కానీ ,లేదా కథ విన్నప్పుడు గాని సినిమా ఎలా ఉండబోతోంది? ప్రేక్షకులు ఆ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే విషయం పై డైరెక్టర్ కి కొంత అవగాహన ఉండి ఉంటుంది.
Video Advertisement
అయితే, కొన్నిసార్లు ఆ సినిమా గురించి దర్శకుడు ఊహించినది నిజం కూడా అవుతుంది. వివరాల్లోకి వెళితే, మన ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది గొప్ప దర్శకులలో ఒకరు కోదండరామి రెడ్డి గారు. అయితే కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు గురించి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలను కోదండరామి రెడ్డి గారు ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో చెప్పారు.
వేట
ఖైదీ తర్వాత కోదండరామి రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి కలిసి చేసిన సినిమా వేట. ఈ సినిమాకి కథని పరుచూరి బ్రదర్స్ అందించారు. కథ మొత్తం బానే ఉన్నా కూడా సినిమాలో హీరోయిన్ విలన్ ని పెళ్లి చేసుకుని, తర్వాత బిడ్డ పుట్టిన కూడా హీరో వెనకాల హీరోయిన్ తిరగడం అనే కాన్సెప్ట్ కోదండరామి రెడ్డి గారికి నచ్చలేదట. అయినా కోదండరామి రెడ్డి గారిని ఒప్పించడంతో సినిమా పూర్తి చేశారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
watch video :
తిరగబడ్డ తెలుగు బిడ్డ
1988లో ఎన్టీఆర్ గారు పిలవడంతో పరుచూరి బ్రదర్స్, కోదండరామి రెడ్డి గారు వెళ్లారు. పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ తనకి నచ్చలేదు అని ఎన్టీఆర్ ముందే చెప్పేసారట కోదండరామి రెడ్డి గారు. ఎన్టీఆర్ గారు కోదండరామి రెడ్డి గారితో “మీకు కథని నచ్చనప్పుడు ఏం చేస్తాం? తర్వాత వేరే ఏదైనా చేద్దాం” అని అన్నారట. దాంతో కోదండరామి రెడ్డి గారు, పరుచూరి బ్రదర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.
ఒక వారం రోజుల తర్వాత షూటింగ్ లో ఉన్న కోదండరామి రెడ్డి గారికి ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి తనకి ఎందుకో ఆ సినిమా నచ్చింది అని, చేసి పెట్టమని అని అన్నారట. దాంతో బాలకృష్ణతో తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా రూపొందించారు కోదండరామి రెడ్డి గారు. ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు.
watch video :
End of Article