అన్నీ చిన్న చిన్న విషయాలు కలిస్తేనే ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ రూపొందుతుంది. సినిమా విషయంలో కూడా ఇదేమి మినహాయింపు కాదు. ఒక సినిమా అంటే అందులో చాలా విషయాలు కలవాలి. హీరో హీరోయిన్లు, మ్యూజిక్, డైలాగ్స్, ఫైట్స్ ఇవన్నీ మాత్రమే కాకుండా పాత్రల డిజైన్ విషయంలో కూడా డైరెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

అంతే కాకుండా ఒక పాత్ర ఎలాగైతే డిజైన్ చేసారో ఆ పాత్రకి తగ్గట్టుగా పేరు కూడా పెడతారు. ఇలా మన దర్శకులలో కొంత మంది తాము రూపొందించిన సినిమాల్లో హీరోయిన్ల పాత్రల పేర్లు రిపీట్ చేశారు. వాళ్ళు ఎవరంటే.

#1 విక్రమ్ కే కుమార్ – ప్రియ

విక్రమ్ కే కుమార్ తన అన్ని సినిమాల్లో హీరోయిన్ పేరు ప్రియ అని పెడతారు. గ్యాంగ్ లీడర్ లో ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర పేరు, హలో లో కళ్యాణి ప్రియదర్శన్ పాత్ర పేరు, మనం లో సమంత పేరు, 24 లో నిత్యా మీనన్ పేరు, ఇష్క్ లో నిత్యా మీనన్ పేరు ప్రియా నే.

Director movies with same heroine names

#2 కృష్ణవంశీ – మహాలక్ష్మి

కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నేపెళ్లాడుతా సినిమాలో టబు పాత్ర పేరు మహాలక్ష్మి. అలాగే ఆయన దర్శకత్వంలోనే వచ్చిన చందమామ సినిమాలో కాజల్ పాత్ర పేరు కూడా మహాలక్ష్మి.

Director movies with same heroine names

#3 రాజమౌళి – ఇందు

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో భూమిక పాత్ర పేరు ఇందిర అలియాస్ ఇందు. సై సినిమాలో కూడా జెనీలియా పాత్ర పేరు, అలాగే మగధీర సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ పాత్ర పేరు ఇందు.

Director movies with same heroine names

#4 త్రివిక్రమ్ శ్రీనివాస్ – వల్లి, సునంద

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యా మీనన్ పాత్ర పేరు వల్లి. అలాగే అఆ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ పాత్ర పేరు నాగవల్లి అలియాస్ వల్లి. అలాగే అత్తారింటికి దారేది సినిమాలో నదియా పేరు సునంద. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఈషా రెబ్బ పేరు సునంద.

Director movies with same heroine names

#5 కరుణాకరన్ – నందిని

కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమాలో కాజల్ పాత్ర పేరు, చిన్నదాన నీకోసం సినిమాలో మిస్తీ చక్రవర్తి పాత్ర పేరు, తేజ్ ఐ లవ్ యు సినిమా లో అనుపమ పరమేశ్వరన్ పాత్ర పేరు నందిని.

Director movies with same heroine names

#6 శ్రీను వైట్ల – శ్రావణి, పూజ, ఐశ్వర్య

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమాలో స్నేహ పేరు, అలాగే కింగ్ సినిమాలో త్రిష పేరు శ్రావణి. ఢీ సినిమాలో, రెడీ సినిమాలో జెనీలియా పేరు, నమో వెంకటేశ సినిమాలో త్రిష పేరు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఒక ఇలియానా పేరు పూజ. అలాగే కింగ్ సినిమాలో మమత మోహన్ దాస్ కూడా పూజ పేరుతో ఇంట్లోకి వస్తారు. ఆనందం సినిమాలో రేఖ పేరు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఇలియానా పేరు ఐశ్వర్య.

Director movies with same heroine names

#7 వివి వినాయక్ – నందిని

చెన్నకేశవరెడ్డి, అఖిల్, కృష్ణ, బన్నీ, బద్రీనాథ్, ఖైదీ నెంబర్ 150, ఇంటలిజెంట్ సినిమాల్లో హీరోయిన్ పాత్రల పేర్లు తప్ప మిగిలిన అన్ని వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్ పాత్ర పేరు నందిని.

Director movies with same heroine names

#8 మెహర్ రమేష్ – ప్రియ

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి సినిమాలో తనీషా ముఖర్జీ పేరు ప్రియ, అలాగే బిల్లా సినిమాలో హన్సిక పేరు ప్రియ.

Director movies with same heroine names

#9 సురేందర్ రెడ్డి – అంజలి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతనొక్కడే సినిమాలో సింధు తులాని పేరు, అశోక్ సినిమాలో సమీరా రెడ్డి పేరు అంజలి.

Director movies with same heroine names

#10 పూరి జగన్నాథ్ – చిత్ర, సంజన

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా సినిమాలో రక్షిత పేరు, బిజినెస్ మాన్ సినిమాలో కాజల్ అగర్వాల్ పేరు చిత్ర. అలాగే 143 సినిమాలో సంజన పేరు, చిరుత సినిమాలో నేహా శర్మ పేరు సంజన.

Director movies with same heroine names