కార్తీక దీపం సీరియల్ పై డైరెక్టర్ కామెంట్! ఎదవ కామెంట్స్ వేసి తిట్లు తింటూ ఉంటా!

కార్తీక దీపం సీరియల్ పై డైరెక్టర్ కామెంట్! ఎదవ కామెంట్స్ వేసి తిట్లు తింటూ ఉంటా!

by Megha Varna

దూరదర్శన్ మొదలైనప్పటి నుండి ఋతురాగాలు ,అంతరంగాలు లాంటి సీరియల్స్
ఆ తర్వాతా అందం,ఎండమావులు,అన్వేషణ ,అమృతం లాంటి కొన్ని సీరియల్స్ మాత్రమే ప్రేక్షుకులలో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా కార్తీక దీపం సీరియల్ కూడా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది.ప్రతీ ఇంట్లో కూడా కార్తీక దీపం అభిమానులు ఉన్నారంటే అతి ఏ మాత్రం అతిశయోక్తి కాదు ..

Video Advertisement

karthika deepam nalla deepa biography

ఈ సీరియల్ మొదటగా మలయాళం లో ప్రసరమై కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ హిట్ సీరియల్ గా పేరు తెచ్చుకుంది ..ఆ తర్వాత తెలుగు లో గత మూడు సంవస్త్రాల నుండి ప్రసారం అవుతూ టిఆర్ పి రేటింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా నడుస్తుంది.అన్ని సీరియల్స్ కంటే కూడా కార్తీకదీపం మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఈ సీరియల్ లో దీప అనే అమ్మాయి నల్లగా ఉంటుంది . ఈ దీప కార్తీక్ అనే డాక్టర్ ను పెళ్లి చేసుకుంటుంది .కానీ కార్తీక్ కి దీప మీద అనుమానం రావడంతో దూరం గా ఉంటాడు.దీపకు ఇద్దరు పిల్లలు ఉంటారు. తన ఇద్దరి పిల్లలతో ఒంటరిగా వంటలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది.దీంతో అందరూ వంటలక్క అని పిలుస్తారు.ఈ నేపథ్యంలో హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను కార్తీక దీపం సీరియల్ మీద కొన్ని కామెంట్స్ చేసారు.

లాక్ డౌన్ కారణంగా సీరియల్ షూటింగ్స్ అన్ని కూడా ఆపివేశారు.దీంతో కార్తీక దీపం సీరియల్ ను మళ్ళీ మొదటి భాగం నుండి ప్రసారం చేస్తున్నారు.అయినా గాని టి ఆర్ పి రేటింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు దూసుకువెళ్తుంది.దీనిపై శైలేష్ కొలను ట్విట్టర్ లో మొథెర్స్ డే సందర్భంగా స్పందిస్తూ “అమ్మ పెద్ద కార్తీక దీపం అభిమాని రోజు టిఫీన్ చేసేటప్పుడు ఈ సీరియల్ గురించి చేస్తున్న డిస్కషన్స్ వినడం వలన ఈ సీరియల్ కథ బాగానే అర్ధం అయింది .అప్పుడు నేను అమ్మతో నన్ను అడిగితె కార్తీక్ దీప ను వదిలేసి మోనితతో సెట్ అయిపోతే బెటర్ అని అన్నాను.అప్పుడు అమ్మ అలా చేస్తే ప్రేక్షకులు ఎవరూ ఒప్పుకోరు పైగా ఆ డైరెక్టర్ దగ్గరకి వెళ్లి మరి కొడతారు” అని బదులు ఇచ్చారని శైలేష్ తెలిపారు .


You may also like

Leave a Comment