శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న సినిమా పెద్దకాపు-1. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో డైరక్టరే విలన్ పాత్రలో కనిపించడం ఓ సంచలనంగా మారింది. సినిమా మొత్తం కులరాజకీయాలతో తిరుగుతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

Video Advertisement

వెనుకబడిన కులానికి చెందిన కుర్రాడు గ్రామంలో ఉండే వాళ్లపై ఎదురుతిరిగి పోరాటం చేస్తే ఏం అవుతుందని చక్కగా ట్రైలర్‌లో చూపించారు.

Srikanth Addala Movies

విలన్ పాత్రలో శ్రీకాంత్ అడ్డాల నటించడానికి ఓ కారణం ఉందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వూలో శ్రీకాంత్ తెలిపాడు. విలన్ పాత్ర గురించి మొదటిగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ను ఫిక్స్ చేశారు. అతను కూడా విలన్ పాత్ర నటించడానికి ఒప్పుకున్నాడు. కానీ షూటింగ్ స్పాట్‌కి రాలేదు. ఆర్టిస్టులతో సెట్ అన్ని ఏర్పాటు చేశాం.

List of Tollywood Director Srikanth addala Moviesఇంకా ఆ సమయంలో శ్రీకాంత్ అసోసియేట్ కిషోర్ వేరే యాక్టర్ ఎందుకు.. నువ్వే ఈ పాత్ర చేయవచ్చు కదా అని అన్నాడు. అయిన శ్రీకాంత్ ఒప్పుకోలేదు. కానీ కిషోర్ బలవంతం చేయగా చివరికి శ్రీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

directors who got chance to direct stars with their second movie..

ఈ కారణాల వల్లే నటుడిగా మారాను తప్ప నాకు యాక్టింగ్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని శ్రీకాంత్ తెలిపాడు. కానీ ఈ సినిమాలో బాగా విలన్ క్యారెక్టర్‌కి కూడా ప్రత్యేకత ఉంది. విలన్ క్యారక్టర్‌కి శ్రీకాంత్ అన్ని విధాలుగా సెట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో డైరక్టర్‌గా ఉండటంతో పాటు నటుడిగా కూడా బిజీగా ఉంటాడో లేదో చూడాలి.