Ads
“చిత్రం” సినిమాతో టాలీవుడ్ కు తేజ దర్శకుడిగా పరిచమయ్యి నేటికీ రెండు దశాబ్దాల కాలం అవుతుంది.అయితే తేజ మొదటగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర సహాయ దర్శకునిగా పనిచేసి తర్వాత కెమరామెన్ గా మారి రాత్రి ,అంతం,తీర్పు లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు.అయితే తేజ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
“చిత్రం ” సినిమా నాకు అలాగే చాలామందికి అది మొదటి సినిమా.అయితే మొదటగా “చిత్రం” సినిమాకు గాను వేరే అతనిని హీరోగా అనుకున్నాం అని తేజ అన్నారు .అప్పుడు ఉదయ్ కిరణ్ ను ఫ్రెండ్ పాత్రకు గాను తీసుకున్నాం.కానీ తర్వాత ఆ వ్యక్తి హీరోగా చెయ్యను అనడంతో ఉదయ్ కిరణ్ ను హీరోగా తీసుకున్నాము అని దర్శకుడు తేజ తెలిపారు.హీరో అని చెప్పినా ఫ్రెండ్ పాత్ర అని చెప్పినా దేనికైనా ఉదయ్ కిరణ్ సిద్ధంగా ఉండేవాడు అని తేజ అన్నారు.ఉదయ్ కిరణ్ స్వభావం చాలా మంచిది,అమాయకుడు అని తేజ అన్నారు.
అయితే “చిత్రం ” సినిమా విజయవంతం అయ్యిన తర్వాత ఈ చిత్రంలో నటించిన రీమా సేన్ ,సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్ అందరూ బిజి అయ్యారు ఒక్క ఉదయ్ కిరణ్ తప్ప అని తేజ తెలిపారు.అయితే ఉదయ్ కిరణ్ కాలిగా ఉండడంతో రోజు ఆఫీస్ కు వచ్చి కూర్చునేవాడు అని తేజ తన గత జ్ఞాపకాలను పంచుకున్నారు . ఆ సమయంలో “నువ్వు నేను ” సినిమా కథ రాసుకున్నప్పుడు మాధవన్ ను హీరో గా అనుకున్నాం అని తేజ అన్నారు.అయితే మాధవన్ తెలుగు సినిమాలు చెయ్యను అని చెప్పడంతో “నువ్వు నేను ” చిత్రంలో హీరోగా ఉదయ్ కిరణ్ ను తీసుకున్నాం అని తేజ అప్పటి విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
End of Article