Ads
హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉంటారు కానీ డైరెక్టర్లకు అభిమానులు అరుదు. కానీ టాలీవుడ్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మాములుగా సినిమా డైలాగులు గుర్తుంచుకోవడం కష్టం.. కానీ త్రివిక్రమ్ మాటలు మర్చిపోవడం కష్టం.
Video Advertisement
త్రివిక్రమ్ ను కాపీ క్యాట్ అని అన్నా.. ఇంకో రకంగా ఆయన్ని విమర్శించినా.. త్రివిక్రముడి డైరెక్షన్ పై నెగటివ్ కామెంట్స్ చేయగలరేమో కానీ ఆయన పవర్ ఫుల్ పంచ్ డైలాగులు కానీ ఆయన మాటలు కానీ మనం రోజూ, ఏదో చోట అనేక సందర్భాల్లో వాడుతూనే ఉంటాం.. ఆయన డైలాగులు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి అని ఓ అభిమాని సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ ఇది..
ఒక విషయాన్ని పొదుపైన మాటల్లో, లోతైన అర్థాన్ని ఇచ్చేలా ఉంటాయి ఆయన డైలాగ్స్. అందుకే ఆయన “మాటల మాంత్రికుడు” అయ్యాడు. జీవిత సత్యాన్ని బోధిస్తాడు కాబట్టి “గురూజీ” అని పిలుస్తారు ఆయన అభిమానులు. డైరెక్టర్ గా ఆయన సినిమాలు ఎంత రిచ్ గా ఉన్నా సంభాషణలు మాత్రం సామాన్యుడిని దాటిపోవు.
ముఖ్యంగా చిరునవ్వుతో, స్వయంవరం లాంటి సినిమాల్లో వేణు డైలాగ్స్, నువ్వు నాకు నచ్చావులో సుహాసిని ఆర్తి అగర్వాల్ తో చెప్పే మాటలు ఎవరు మర్చిపోలేరు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్స్ కి కొన్ని స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయి..
మచ్చుకు కొన్ని త్రివిక్రమ్ డైలాగ్స్:
1. విడిపోవడం తప్పదు అన్నప్పుడు.. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.
2. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. చెప్పక పోతే ఎప్పుడు భయం వేస్తుంది.
3. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
4. వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు.
5. పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?
6. మనకు వస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకి వస్తే నరకం.
7. యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు.. ఓడించడం.
8. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే.
9. కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. మోసపోయి కన్న వాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
10. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా.. ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.
11. భయపడటంలోనే “పడటం” ఉంది.
12. ఆశ కాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది.
13. ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమను దాటినవాడు ఎవ్వరూ లేరు.
14. దేవుడు దుర్మార్గుడు..కళ్లున్నాయని సంతోషించే లోపే, కన్నీళ్ళున్నాయని గుర్తుచేస్తాడు.
15. గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం. కానీ కోపమయినా, చిరాకయినా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తాం.
16. సక్సెస్ లో ఏ వెధవాయినా నవ్వుతాడు, కానీ ఫెయిల్యూర్ లో నవ్వేవాడే హీరో.
17. కన్నీళ్లు చాల విలువయినవి.. విలువల్లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు.
18. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.
19. ఎంత పెద్దవాడికి “నో” చెప్తే అంత గొప్పవాడివి అవుతావు.
20. బరువు పైన ఉంటె కిందకి చూడలేము, ఎంత బరువు ఉంటె అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.
21. యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు.
22. వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా..
23. కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి?
24. మాట్లాడితే మా వాళ్లే కాదు.. శత్రువులు కూడా వింటారు.
25. వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
26. ఈ వయసులో నాకు కావాల్సింది నిజాలు, అబద్ధాలు కాదు జ్ఞాపకాలు.
27. కారులో ముందు సీటుకి, వెనక సీటుకి దూరం ఎవరూ తగ్గించలేరు.
28. దూరం నుంచి చూస్తే భూమి, ఆకాశం కలిసినట్టు కనిపిస్తాయి. కానీ అది అబద్ధం. ఈ ఔట్ హౌస్ నుంచి చూస్తే వాళ్ల బంగ్లా చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా అబద్ధమే.
29. లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కునే అశాంతి పెళ్లి.
30. భయపడే వాడు ప్రేమించకూడదు .. పేమించేవాడు భయపడకూడదు .. రెండు చేస్తే బాధ పడకూడదు.
31. నువ్వు తలెత్తుకుంటే అందరు నిన్ను చూడడానికి నీ తల ఏమి జాతీయ జండా కాదు.
32. అదృష్టం ఒకే సరి తలుపు తడుతుంది.. దురదృష్టము తీసే దాకా తలుపు తడుతుంది.
33. అమ్మ, ఆవకాయ్ , అంజలి మూడు ఎప్పుడు బోర్ కొట్టావు – నువ్వే నువ్వే ఎవరన్నా ఎదిగిన తరవాత పెళ్లి చేసుకుంటారు , నీ కొడుకు మాత్రం ఎదగడం కోసం పెళ్లి చేసుకుంటున్నాడు.
34. ఉప్పు తింటే బీపీ, చక్కర తింటే షుగర్ , కారము తింటే అల్సర్.. సరిగ్గా అన్నం తింటే చచ్చిపోతావు.. నీకెందుకు రా ఆస్తి
35. దేవుడైన రాముడు కూడా వాలిని చెట్టు చాటు నుంచే చంపాడు, ముందు నుంచి చంపడం చేతకాక కాదు, కుదరక.
36. అద్భుతం జరిగేటపుడు ఎవరు గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
37. కారణం లేని కోపం , గౌరవం లేని ఇష్టం , బాధ్యత లేని యవ్వనం , జ్ఞాపకం లేని వృధాప్యం .. అలంటి వాడు ఉన్న లేకపోయినా ఒకటే.
38. మనం బాగున్నపుడు లెక్క మాట్లాడి , బాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు.
39. నందు వదిలేస్తున్నావా నన్ను ? లవ్ చేసే అంత లగ్జరీ లేదు వదిలేసే అంత లెవెల్ లేదు.
40. జీవితంలో మనము కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధం ఉంది.
ఇవే కాదు ఇలాంటివి ఇంకా అనేకం.. త్రివిక్రమ్ కలంలోంచి వెండితెరకు జాలువారిన ఎన్నో సంభాషణలు ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. తూటాలాంటి సీన్స్ త్రివిక్రమ్ పెన్ నుంచి గన్ లా పేలుతూనే ఉంటాయ్..
End of Article