వెంకటేష్ మహా గురించి అందరికీ తెలుసు. వెంకటేష్ మహా కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు. ఈ సినిమా టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదల అయ్యి పెద్ద హిట్ ని అందుకుంది. తాజాగా వెంకటేష్ మహా యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అతను ఆ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

వెంకటేష్ మహాతో పాటుగా ఇంటర్వ్యూలో నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ కూడా పాల్గొన్నారు.

ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన కేజిఎఫ్ సినిమా మీద సంచలన కామెంట్స్ చేశాడు మహా. కొన్ని విలువల తో కూడిన సినిమాలను ఇక్కడ ఉన్న డైరెక్టర్లు తీస్తున్నామని అభ్యుదయ భావాలని పక్కన పెట్టేసి వైలెన్స్ గా సినిమాలు తీస్తే ఇంకా గొప్పగా తీయొచ్చు అని చెప్పారు. సినిమా చివర తవ్విన వాళ్ళకి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చి ఆ బంగారం అంతా తీసుకోమని సముద్రంలో పడేసే నీచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే చప్పట్లు కొడుతున్నాం మనం అని ఇండైరెక్ట్ గా కేజిఎఫ్ సినిమా గురించి కామెంట్స్ చేసారు.

kgf 2 teaser

ఇలా అనడంతో సోషల్ మీడియాలో వెంకటేష్ మహాని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి చాలా సినిమాలు వస్తాయి కానీ అన్ని సినిమాలు అందరికీ నచ్చవు. పైగా అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ కూడా లేదు. కానీ కేజీఎఫ్ సినిమా డైరెక్టర్ మీద వెంకటేష్ మహా అలా కామెంట్లు చేయడం సరైనది కాదు అని నేటిజెన్లు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు స్పందిస్తున్నారు.

ఒక డైరెక్టర్ గురించి వెటకారంగా మాట్లాడడం ఎంతవరకు సరైనది..? పైగా సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది అటువంటి సినిమా గురించి నీచంగా మాట్లాడడం సరైనదా..? ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరూ ఆ వీడియోని చూసేయండి.