మన డైరెక్టర్లు తమ మొదటి సినిమాకి దర్శకత్వం వహించే ముందు ఎన్నో శాఖలలో పని చేస్తారు. ప్రతి ఒక్కరూ ఒక పర్టిక్యులర్ వయసులో మాత్రమే కెరీర్ మొదలు పెట్టాలి అని రూలేమీ లేదు. అంతే కాకుండా అందరికీ ఒకటే వయసులో అవకాశం రావాలని కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏజ్ ఒక నెంబర్ మాత్రమే.

అలా మన దర్శకులు కూడా ఒక్కొక్కరు, ఒక్కొక్క వయసులో తమ మొదటి సినిమాకి దర్శకత్వం వహించారు. అలా వాళ్ళ మొదటి ఫీచర్ ఫిలిం కి దర్శకత్వం వహించినప్పుడు మన ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్ల వయసు ఎంతో ఇప్పుడు చూద్దాం.

#1 త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ 1971 లో పుట్టారు. డైరెక్టర్ గా మొదటి సినిమా 2002 లో వచ్చిన నువ్వే నువ్వే. అంటే ఆ సినిమా టైంకి త్రివిక్రమ్ వయసు 31 సంవత్సరాలు.

#2 పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ 1966 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2000 లో వచ్చిన బద్రి. బద్రి సినిమా టైం కి పూరి జగన్నాథ్ వయసు 34 సంవత్సరాలు.

#3 ఎస్. ఎస్. రాజమౌళి

రాజమౌళి 1973 లో జన్మించారు. మొదటి సినిమా 2001 లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్. ఈ సినిమా సమయానికి రాజమౌళి వయసు 28 సంవత్సరాలు.

#4 హరీష్ శంకర్

హరీష్ శంకర్ 1979 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2006 లో వచ్చిన షాక్. ఈ సినిమా టైం కి హరీష్ శంకర్ వయసు 27 సంవత్సరాలు.

#5 తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్ 1988 లో పుట్టారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2016 లో వచ్చిన పెళ్లిచూపులు. ఈ సినిమా టైం కి తరుణ్ భాస్కర్ వయసు 28 సంవత్సరాలు.

#6 రామ్ గోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ 1962 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1989 లో వచ్చిన శివ. ఈ సినిమా టైం కి రామ్ గోపాల్ వర్మ వయసు 27 సంవత్సరాలు.

#7 శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల 1972 లో జన్మించారు. మొదటి సినిమా 1999 లో వచ్చిన డాలర్ డ్రీమ్స్. ఈ సినిమా టైంకి శేఖర్ కమ్ముల వయసు 27 సంవత్సరాలు.

#8 శంకర్

శంకర్ 1963 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1993 లో వచ్చిన జెంటిల్ మ్యాన్. ఈ సినిమా టైం కి శంకర్ వయసు 30 సంవత్సరాలు.

#9 సుజిత్

సుజిత్ 1990 లో పుట్టారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2014 లో వచ్చిన రన్ రాజా రన్. ఈ సినిమా టైం కి సుజిత్ వయసు 24 సంవత్సరాలు.

#10 సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి 1981 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి. ఈ సినిమా టైం కి సందీప్ వయసు 36 సంవత్సరాలు.

#11 కొరటాల శివ

కొరటాల శివ 1975 లో జన్మించారు. మొదటి సినిమా 2013 లో వచ్చిన మిర్చి. ఈ సినిమా టైంకి కొరటాల శివ వయసు 38 సంవత్సరాలు.

#12 శ్రీను వైట్ల

శ్రీను వైట్ల 1972 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1999 లో వచ్చిన నీకోసం. ఈ సినిమా టైం కి శ్రీను వైట్ల వయసు 27 సంవత్సరాలు.

#13 సురేందర్ రెడ్డి

సురేందర్ రెడ్డి 1975 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2005 లో వచ్చిన అతనొక్కడే. ఈ సినిమా టైం కి సురేందర్ రెడ్డి వయసు 30 సంవత్సరాలు.

#14 వివి వినాయక్

వివి వినాయక్ 1974 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2002 లో వచ్చిన ఆది. ఆది సినిమా టైం కి వివి వినాయక్ వయసు 28 సంవత్సరాలు.

#15 సుకుమార్

సుకుమార్ 1970 లో జన్మించారు. దర్శకత్వం వహించిన మొదటి సినిమా 2004 లో వచ్చిన ఆర్య. ఈ సినిమా టైం కి సుకుమార్ వయసు 34 సంవత్సరాలు.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com