దసరా “శ్రీకాంత్ ఓదెల” తో పాటు… ఇండస్ట్రీకి “నాని” పరిచయం చేసిన 10 డైరెక్టర్స్..!

దసరా “శ్రీకాంత్ ఓదెల” తో పాటు… ఇండస్ట్రీకి “నాని” పరిచయం చేసిన 10 డైరెక్టర్స్..!

by Anudeep

Ads

నాచురల్ స్టార్ నాని.. ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. మెగా ఫోన్ పట్టుకొని కెమెరా వెనకుండి యాక్షన్ అని చెప్పాలనుకున్న నాని… కెమెరా ముందుకొచ్చి హీరో అయ్యాడు. ఇక నాని ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా టాలెంట్, హార్డ్ వర్క్ తో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నారు.

Video Advertisement

అలా అష్టా చెమ్మా మూవీతో నాని హీరో అయ్యాడు. 2008లో విడుదలైన ఆ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. స్నేహితుడు అనే మరో చిన్న సినిమాతో నాని అద్భుతం చేశాడు. అలా మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల కంట్లో పడ్డాడు. నానికి ఫేమ్ తెచ్చిన మొదటి సినిమా అలా మొదలైంది. నాని నటుడిగా 15 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. తన సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ నాని ప్రధాన బలాలు.

minus points in nani dasara trailer

అయితే శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం మంచి జోష్ మీద వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు నాని. తన కెరీర్ మొత్తం లో నాని స్టార్ డైరెక్టర్స్ తో కంటే కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేసారు. స్టార్డం వచ్చాక కూడా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు నాని. ఇప్పుడు నాని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో చూద్దాం..

#1 శ్రీకాంత్ ఓదెల

నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

directors who are introduced by hero nani

#2 నాగ్ అశ్విన్

నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం తో నాగ్ అశ్విన్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.

directors who are introduced by hero nani

#3 అంజనా అలీ ఖాన్

నిత్య మీనన్, నాని ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ చిత్రం వెప్పం. దీన్ని తెలుగులో ‘సెగ’ అనే పేరుతో రిలీజ్ చేసారు. ఈ చిత్ర దర్శకురాలు అంజనా అలీ ఖాన్ కి ఇది మొదటి చిత్రం.

directors who are introduced by hero nani

#4 నందిని రెడ్డి

నాని కి కమర్షియల్ హీరో గా పేరు తెచ్చిన చిత్రం అలా మొదలైంది. నందిని ఎడ్డీ ఈ చిత్రం తో దర్శకురాలిగా పరిచయం అయ్యారు.

directors who are introduced by hero nani
#5 తాతినేని సత్య

భీమిలి కబడ్డీ జట్టు చిత్రం తో తాతినేని సత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు.

directors who are introduced by hero nani

#6 శివ నిర్వాణ

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రం తో శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

directors who are introduced by hero nani

#7 శౌర్యువ్

గత సంవత్సరం వచ్చిన హాయ్ నాన్న సినిమాతో నాని శౌర్యువ్ ని దర్శకుడిగా పరిచయం చేశారు.

directors who are introduced by hero nani

#8 గోకుల్ కృష్ణ

నాని, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఆహా కళ్యాణం. ఈ చిత్రం తో గోకుల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

directors who are introduced by hero nani

#9 ప్రశాంత్ వర్మ

అ! చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి నాని నిర్మాత.

directors who are introduced by hero nani

#10 శైలేష్ కొలను

హిట్ ఫ్రాంచైజ్ తో గుర్తింపు పొందారు శైలేష్ కొలను. ఈ చిత్రాలకు నాని నిర్మాత గా వ్యవహరించారు.

directors who are introduced by hero nani


End of Article

You may also like