Ads
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక చిత్రం తరువాత మరొక చిత్రం హీరోల పుట్టినరోజుల సందర్భంగా పాత చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ రీ రిలీజ్ అయ్యింది.
Video Advertisement
ఇప్పుడు నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమా రీరిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బాలయ్య కెరీర్ లోనే కాకుండా, తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలో బెస్ట్ మాస్ మూవీగా గా నిలిచి, ప్రేక్షకుల అందరికి నచ్చిన చిత్రంగా నిలిచిన మూవీ నరసింహ నాయుడు. ఈ మూవీ 2001 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ రికార్డ్స్ లను తిరగరాసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ లో 20 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఈ చిత్రం 95 కి పైగా సెంటర్స్ లో వంద రోజులు ఆడింది.
అలాంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీని బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10న 2 తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే నరసింహానాయుడు సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఏరియాలలో ఓపెన్ అయ్యాయి. బాలయ్య చిత్రాలకు సీడెడ్ లో హడావుడి ఎప్పుడూ ఉంటుంది. ఈ సారి అక్కడ హడావుడి ఉన్నా, అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా బుకింగ్స్ జోరుని ఏమాత్రం చూపించడం లేదు.
నైజాంలో మరియు ఆంధ్రలో కూడా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. రాయలసీమలో అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని ఏరియాలలో తప్ప మిగతా చోట్లా మాత్రం బుకింగ్స్ వీక్ గా ఉన్నాయి. ఈ ఏడాది విడుదలయిన రీ రిలీజ్ పుట్టిన రోజు చిత్రాలలో వీకేస్ట్ బుకింగ్స్ ఈ మూవీకే అని అంటున్నారు.
Also Read: TAKKAR REVIEW : “సిద్ధార్థ్” హీరోగా నటించిన టక్కర్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article