Ads
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల బిజినెస్ పెరిగింది. అదే రీతిలో బడా హీరోల మార్కెట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా చిత్రాలు విడుదలకు ముందే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలు అంచనాలు అందుకుంటే సేఫ్ అవుతున్నాయి. అదే డివైడ్ టాక్ వచ్చిందంటే అంతే సంగతులు.
Video Advertisement
టాలీవుడ్ నుంచి అద్భుత చిత్రాలు వస్తుండటం తో ఇతర రాష్ట్రాలలో కూడా వాటికీ మార్కెట్ పెరిగింది. దీంతో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ కావడం ఎక్కువయ్యాయి.
ఇప్పుడు ఆ సినిమాలేంటో చూద్దాం..
#1 రాధే శ్యామ్
బాహుబలి చిత్రం తో పాన్ ఇండియా స్టార్ గా మారారు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన సాహూ చిత్రం యావరేజ్ గా నిలవగా.. రాధే శ్యామ్ డిజాస్టరుగా నిలిచింది.
#2 ఆచార్య
ఫస్ట్ టైం మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ గా కలిసి నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలై ప్లాప్ గా నిలిచింది.
#3 ఖిలాడీ
మాస మహారాజ రవి తేజ నుంచి వచ్చిన ఫుల్ మాస్ చిత్రం కిలాడీ. కానీ ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.
#4 గని
వరుణ్ తేజ్ కెరీర్ లో మొదటిసారిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రం గని. ఈ చిత్రం కోసం మూడేళ్ళుగా వరుణ్ తేజ్ కష్టపడుతున్నా.. చిత్ర ఫలితం నెగటివ్ గా వచ్చింది.
#5 గుడ్ లక్ సఖి
మహానటి చిత్రం తో తనలోని నటిని బయట పెట్టిన కీర్తి సురేష్..ఆ తర్వాత మాత్రం కథల ఎంపికలో తడబడుతోంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన గుడ్ లక్ సఖి కీర్తికి మాత్రం లక్ తీసుకురాలేకపోయింది.
#6 సన్ అఫ్ ఇండియా
డిమాండ్ రత్న బాబు తెరకెక్కించిన ఈ చిత్రం లో మోహన్ బాబు , మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.
#7 లైగర్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. కానీ అంచనాలు అందుకోలేకపోయింది ఈ చిత్రం.
#8 బీస్ట్
తమిళ్ లో స్టార్ హీరోగా ఉన్న విజయ్ డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఎన్నో అంచనాలతో వచ్చిన బీస్ట్ సినిమా లో ప్రత్యేకత ఏమి లేక ఒక సాధారణ చిత్రం గా నిలిచిపోయింది.మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ అనేవి స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటారు.ఇందులో అవి మిస్ అయ్యాయి.
#9 ఘోస్ట్
ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చూసాక నాగార్జున బౌన్స్ బ్యాక్ అయ్యే సినిమా అని అందరు ఫిక్స్ అయిపోయారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని తలకిందులయ్యాయి. డివైడ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది ఈ చిత్రం.
#10 హ్యాపీ బర్త్డే
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా హ్యాపీ బర్త్ డే. ఈ చిత్రానికి ప్రోఇమోషన్స్ భారీ ఎత్తున చేసారు కానీ సినిమాలో అంత బలం లేక ప్లాప్ గా మిగిలింది.
#11 అంటే సుందరానికి
సినిమా రిలీజ్ కి ముందు ఉన్న అంచనాలన్నీ ఫస్ట్ షో పడగానే కరిగిపోయాయి. మినిమం గ్యారంటీ హీరో నాని కూడా కథ ఎంపికలో తడబడి పోయి ఒక ప్లాప్ ని మూటగట్టుకున్నాడు.
#12 విరాట పర్వం
నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచింది కానీ.. కలెక్షన్లు కురిపించలేకపోయింది.
End of Article