Ads
మనలో చాలా మందికి సినిమా అంటే తెలియని క్రేజ్ ఉంటుంది. సినిమా వాళ్లంటే కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. వాళ్లు నిజజీవితంలో ఎలా ఉంటారు? మనలాగే ప్రవర్తిస్తారా? ఏం తింటారు? ఎక్కడ ఉంటారు? ఇలా వాళ్ల గురించి ప్రతి విషయం తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. అందుకనే సినిమా గురించి వచ్చిన ఏ న్యూస్ కి అయినా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అందరికీ ఇలానే ఉండాలి అనే రూలేమీ లేదు.
Video Advertisement
చాలా మందికి సినిమా అంటే చిన్న చూపు కూడా ఉంటుంది. అసలు దీన్ని ఒక వృత్తి లాగా కూడా కన్సిడర్ చెయ్యరు. సినిమాల్లో పనిచేసే వాళ్లు అంటే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. వాళ్లు మనకు తెలియక పోయినా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎలా ఉండాలో కూడా మనమే నిర్ణయిస్తూ ఉంటాం. అందుకు ఒక ఉదాహరణ ఇప్పుడు చూద్దాం.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దిశా పటాని. అంతకు ముందు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. ఆ తర్వాత ఎమ్మెస్ ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ, భాగీ 2, మలంగ్ సినిమాల్లో కూడా నటించారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు దిశా పటాని.
దిశా పటానికి ఒక సోదరి ఉన్నారు. తన పేరు ఖుష్బూ పటాని. ఖుష్బు పటాని ఆర్మీ లో ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది. దాంతో ఎంతోమంది వారిద్దరినీ పోల్చి చూడడం మొదలు పెట్టారు. ఖుష్బూ పటానీ ని పొగడటం మొదలుపెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దిశా పటానిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఒకరు ఆర్మీలో ఉన్నారు. ఇంకొకరు సినిమాల్లో ఉన్నారు. ఆర్మీ అంటే నిజంగానే చాలా గొప్ప. దేశానికి సేవ చేయడం అనేది నిజంగానే గర్వించదగ్గ విషయం. కానీ అలా అని సినిమాల్లో ఉన్నందుకు ట్రోలింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకరికి ఆసక్తి ఉన్న ఫీల్డ్ లో ఇంకొకరికి ఆసక్తి ఉండాలి అనే రూలేమీ లేదు కదా? ఇవన్నీ మనమే ఆలోచించాలి.
End of Article